ఐపీఎల్ వచ్చింది అంటే చాలు క్రికెట్ ప్రేక్షకులు అందరూ పండగ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే కనీవినీ ఎరుగని రీతిలో ఐపీఎల్ క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటుంది. ఇక బిసిసీఐ ఐపీఎల్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి సీజన్ అంతకంతకూ క్రేజ్ సంపాదించుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే  ప్రపంచంలో ఉన్న అన్ని దేశవాళి క్రికెట్ లీగ్ లలో ఐపీఎల్ అతి పెద్ద లీగ్ గా గుర్తింపు సంపాదించింది. అయితే ఐపీఎల్ లో ఎంతో మంది విదేశీ క్రికెటర్లు భారత క్రికెటర్ల తో కలిసి ఆడుతూ ఉంటారు. సహచరులుగా ఉన్న భారత క్రికెటర్లు ప్రత్యర్థులుగా మారి పోటీ పడుతుంటారు.



 ఇకపోతే ఐపీఎల్ మజా మరింత పెంచాలని బిసిసిఐ భావిస్తోంది. ఈక్రమంలోనే ఇక వచ్చే సీజన్లో కొత్తగా రెండు జట్లను ఐపీఎల్ లోకి తీసుకురావాలని బిసిసిఐ అనుకుంటుంది. అయితే ఈ కొత్త జట్ల కోసం ఇక ఐపీఎల్లో జట్లను ప్రక్షాళన చేసి మెగా వేలం నిర్వహించాలని అనుకుంటుంది బీసీసీఐ  ఈ మెగా వేలాన్ని ఈ ఏడాది చివర్లో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక ఐపీఎల్ లో 2 కొత్త జట్లు వస్తుండడంతో ఇటీవలే బీసీసీఐ ఒక కొత్త రూల్ తెరమీదకు తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అన్ని ఫ్రాంచైజీ లలో కూడా గుబులు పట్టుకుందట .  బీసీసీఐ మెగా వేలం నిర్వహించేందుకు తలపెట్టగా.. మెగా వేలానికి ముందు ప్రతి జట్టు కూడా కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే రిటైన్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది.



 ముగ్గురు స్వదేశీ ఆటగాళ్లు ఒక విదేశీ ఆటగాడు లేదా ఇద్దరు స్వదేశి ఇద్దరు విదేశీ ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.  ఈ క్రమంలోనే ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు సరికొత్త డిమాండ్ తెరమీదికి తెస్తున్నారు. చెన్నై లో ఫస్ట్ ఛాయిస్ కేంద్ర మహేంద్ర సింగ్ ధోనీ ఉంటాడు. ఇక ఆ తర్వాత సురేష్ రైనా, రవీంద్ర జడేజా, శ్యామ్ కరణ్, మోయిన్ అలీ లాంటి క్రికెటర్లు ఉంటారు. అయితే ప్రస్తుతం సురేష్ రైనా పై మాత్రం అటు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది  సురేష్ రైనాను మెగా వేలంలో సీఎస్కే జట్టు వదిలేసి అతని స్థానంలో ఒక మంచి యువ ఆల్రౌండర్ ను తీసుకుంటే బాగుంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట అభిమానులు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: