మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. ఎంత గొప్ప ఆటగాడో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే క్రికెట్ అభిమానుల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు ధోనీ. ఇక భారత జట్టు తరఫున నుంచి కాకుండా, IPL లో CSK టీం తరపున కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ధోని గురించి CSK  సంస్థ ఒక విషయం తెలిపింది. అది ఏంటో తెలుసుకుందాం.

ధోని గత రెండు సంవత్సరాల నుంచి IPL నుంచి తప్పుకుంటున్నాడు అనే విషయం జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై CSK టీమ్ మేనేజ్మెంట్ స్పందిస్తూ.. మా టీం కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనినే. అని తెలియజేశారు. అంతే కాకుండా తను ఇంకా రెండు సంవత్సరాల పాటు కెప్టెన్సీ బాధ్యతలు  చూసుకుంటాడని తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా CSK టీం ఎగ్జిక్యూటివ్ "కాశీ విశ్వనాధ్" IANS తో వెల్లడించారు.

ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానులు, CSK టీం ఫ్యాన్స్ ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతకుముందే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోని. ఐపీఎల్ లో మాత్రం తనదైన శైలితో అందరినీ అలరిస్తున్నాడు. ఇక అంతే కాకుండా uae లో 2021 లో జరగబోయే ఐపీఎల్ లోను ధోనీ కెప్టెన్సీ గా వ్యవహరిస్తున్నాడు.

ఇదే సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వాయిదా పడ్డ మ్యాచులు జరగనున్నాయి. ఇండియాలో కరోనా కారణం చేత ఐపీఎల్ మ్యాచ్లు కొన్ని వాయిదా పడ్డ  విషయం అందరికీ తెలిసిందే."ఇదే సమయంలో మాజీ భారత్ wicket keeper విజయ్ దహియా" ఏమని చెప్పాడంటే.. CSK  అంటే ధోని, ధోని అని అంటే CSK అన్నంత  గుర్తింపు తెచ్చుకున్నాడని తెలిపారు.

ధోని   ఆడిన ఎన్నో మ్యాచ్ లలో  తనకు అనుభవం చాలా  ఉందని, ధోని సలహామేరకు ఎంతో మంది ఆటగాళ్లు ఐపీఎల్ లో  బాగా ఆడున్నారని తెలిపారు. ఇందుకు చక్కని ఉదాహరణ ఇంగ్లాండ్ ప్లేయర్"శ్యామ్ కరణ్" అని తెలిపారు. ఏది ఏమైనా ధోని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని చెప్పవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: