అయితే విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా కోహ్లీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే కోహ్లీ జెర్సీ నెంబర్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు కూడా వైరల్ మారిపోతున్నాయి. అయితే విరాట్ కోహ్లీ ధరించే జెర్సీ నెంబర్ 18 అన్న విషయం తెలిసిందే. అయితే 18 నెంబర్ జెర్సీ కోహ్లీ ధరించడం వెనుక పెద్ద కారణమే ఉంది. విరాట్ కోహ్లీ తండ్రి 2006 డిసెంబర్ 18 వ తేదీన అనారోగ్యంతో మరణించారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ అండర్ 19 జట్టులో కొనసాగుతున్నారు. అయితే ఆ సమయంలోకోహ్లీ వయసు కూడా పద్దెనిమిదేళ్లు కావడం గమనార్హం.
అయితే ఇక 2006 సమయంలో తండ్రి చనిపోయినప్పటికీ కొండంత బాధను మనసులో పెట్టుకొని వచ్చి ఏకంగా భారత్ తరఫున అండర్ 19 జట్టులో అద్భుతంగా రాణించాడు విరాట్ కోహ్లీ. తండ్రి చనిపోయిన బాధలో కూడా జట్టుకు విజయం అందించడం కోసం సెంచరీ చేసి అదరగొట్టాడు. ఇక అప్పటి నుంచి విరాట్ కోహ్లీ తన జెర్సీ నెంబర్ 18 గా మార్చుకున్నాడు. సాధారణంగా క్రికెటర్లు అందరూ కూడా తమ లక్కీ నెంబర్ ని తమ జెర్సీ నెంబర్ గా మార్చుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇక తాను కూడా అతీతుడు కాదు అన్న విషయాన్ని తన జెర్సీ నెంబర్ తో చెప్పేసాడు విరాట్ కోహ్లీ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి