టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడింది. ఇక ఈ రెండు టెస్ట్ మ్యాచ్లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే.. రెండవ టెస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టు విజయాన్ని సాధించింది. దీంతో ప్రస్తుతం సిరీస్ 1-1 తో సమానంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మూడవ టెస్ట్ మ్యాచ్ లో ఎవరు విజయం సాధించి పోతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది. ఇక ఈ మ్యాచ్ వీక్షించేందుకు అటు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. కేప్ టౌన్ వేదికగా జనవరి 11వ తేదీ అధిక ఈ మూడవ టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది.



 అయితే సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాలని పట్టుదలతో విరాట్ కోహ్లీ సేన ఉంది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే మూడో టెస్ట్ మ్యాచ్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు కోహ్లీ సేన. అయితే రెండవ టెస్ట్ మ్యాచ్లో వెన్నునొప్పి కారణంగా అటు మ్యాచ్ కు దూరమైన విరాట్ కోహ్లీ మూడో టెస్ట్ మార్కెట్లో అందుబాటులోకి రావడం దాదాపు ఖరారయ్యింది. అయితే ఇక మూడవ టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీనీ ఒక అరుదైన రికార్డు ఊరిస్తోంది.


 భారత క్రికెట్లో దిగ్గజ క్రికెటర్ గా ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా కొనసాగుతున్న రాహుల్ ద్రవిడ్ రికార్డును అధికమించేందుకు విరాట్ కోహ్లీ కి ఛాన్స్ వచ్చింది. దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటివరకూ భారత ఆటగాళ్ల లో అత్యధిక పరుగులు చేసింది. సచిన్ టెండూల్కర్ 1161 పరుగుల తో మొదటి స్థానంలో ఉన్నాడు తర్వాత రాహుల్ ద్రావిడ్  624 పరుగులతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా ప్రస్తుతం విరాట్ కోహ్లీ 611 పరుగుల వద్ద ఉన్నాడు. ఈ క్రమంలోనే రాహుల్ ద్రవిడ్ రికార్డును అధిగమించాలి అంటే కోహ్లీ మరో 14 పరుగులు చేయాల్సి ఉంది. దీంతో ఇక మూడవ టెస్ట్ మ్యాచ్లో 14 పరుగులు చేసి కోచ్ రాహుల్ ద్రవిడ్ పై కోహ్లీ పైచేయి సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: