గత ఏడాది టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లడానికి ముందు టీమిండియా వన్డే జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ క్రమంలోనే ఇక రోహిత్ శర్మను కెప్టెన్గా నియమిస్తూ విరాట్ కోహ్లీ ని తపిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలా టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించడం సంచలనం గానే మారిపోయింది. అయితే తాము ముందుగానే సమాచారం ఇచ్చాము అంటూ సౌరవ్ గంగూలీ చెప్పడం.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కెప్టెన్సీ నుంచి తప్పించారు అంటూ విరాట్ కోహ్లీ కామెంట్ చేయడం తో ఇలా కెప్టెన్సీ మార్పు కాస్త పెద్ద వివాదంగా మారిపోయింది. ఇక వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత టెస్ట్ కెప్టెన్ గా మాత్రమే కొనసాగిన విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.



 అయితే బిసిసిఐ వన్డే కెప్టెన్సీ నుంచి తపించడం కారణంగానే కోహ్లీ మనసు బాధ పడింది. అందుకే  టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు అంటూ ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సక్సెస్ఫుల్ కెప్టెన్గా ఉన్న కోహ్లీ విషయంలో బిసిసిఐ సరిగా వ్యవహరించలేదు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న వారు కూడా లేకపోలేదు. కెప్టెన్సీ మార్పు  జరిగి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా కెప్టెన్గా కోహ్లీని తప్పించడం గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూనే ఉన్నారు. ఇటీవల ఇదే విషయంపై టీం ఇండియా మాజీ ఆటగాడు దిగ్గజ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై విమర్శలు ఎదుర్కొంటున్న బిసిసిఐకి మద్దతుగా నిలిచాడు సంజయ్ మంజ్రేకర్. అభిమానులు వరల్డ్ కప్  వంటి ఐసీసీ ట్రోఫీలు గెలవాలని ఆశిస్తున్నారు. అంతేగాని ర్యాంకులు సిరీస్ల గురించి ఆలోచించడం లేదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి అంటూ సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చారు. ఐసీసీ ట్రోఫీలు గెలిపించడంలో విరాట్ కోహ్లీ ఎంత ఇబ్బంది పడుతున్నాడు. ఇక విరాట్ ను  కెప్టెన్సీ నుంచి తప్పించడానికి కూడా ఇదే కారణం. ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడం కారణంగానే కోహ్లీని తప్పించి రోహిత్ శర్మకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది బిసిసీఐ. ఇది సరైన నిర్ణయమే అంటూ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు కాస్త ఆసక్తికరం గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: