అయితే బీసీసీఐ ప్రకటించిన వన్డే టీ 20 జట్టు లో ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్థానం కల్పించినట్లు తెలుస్తోంది. ఇలా బిసిసిఐ ప్రకటించిన జట్టులో ఎన్నో రోజుల పాటు అటు దూరంగా ఉన్న చైనా మన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ కు స్థానం దక్కడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. గాయం బారినపడి క్రికెట్కు దూరమైన కుల్దీప్ యాదవ్ కు బిసిసీఐ సెలెక్టర్లు జట్టులో ఎలా స్థానం కల్పించారు అన్నదే ప్రస్తుతం ప్రధానంగా చర్చ జరుగుతూ ఉండటం గమనార్హం. ఈ విషయంపై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగడం కుల్దీప్ కు ఎంతో కష్టతరంగా మారిపోతుంది అంటూ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. గత ఏడాది ఐపిఎల్ సందర్భంగా గాయపడిన కుల్దీప్ ముందు ఉన్నదంతా కఠినమైన మార్గం అంటూ హర్భజన్ తెలిపాడు. గాయం బారినపడి దూరమైన కుల్దీప్ గత కొంతకాలంగా దేశవాళీ మ్యాచ్లు కూడా ఆడలేదు. ఏ క్రికెట్ మ్యాచ్ ఆడకుండా అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేయడం అంత సులువైనది కాదు. మోకాలికి శస్త్ర చికిత్స చేసుకోవడానికి ముందు కూడా అతను అంతర్జాతీయ క్రికెట్ లో క్రమంగా ఆడలేదు. అయితే ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో పునరాగమనం చేస్తున్న బౌలర్ ప్రతిఒక్కరి మదిలో ఒక ఆలోచన ఉంటుంది. నా బౌలింగ్ లో బ్యాట్స్మెన్లు చితక్కొట్టకూడదు అని ఉంటుంది. ఇక ఇప్పుడు కుల్దీప్ యాదవ్ మానసిక దృఢత్వానికి ఇది ఒక పరీక్ష లాంటిది అంటూ చెప్పుకొచ్చాడు హార్భజన్ సింగ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి