ఇటీవల కాలంలో సినిమా పోస్టర్లు అందరూ తెగ వాడేస్తున్నారు. ఏదైనా సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది అంటే చాలు ఇక ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఇక ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోతే ఏమవుతుంది అన్న విషయాన్ని తెలుపుతూ వాడుతూ ఉన్నారు. మరికొన్నిసార్లు అటు క్రికెట్ లో కూడా ఇలా సినిమా హీరోల పోస్టర్లు ఉపయోగించుకుంటూ ఉంటారు. సినిమా హీరోల ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇక ఇక క్రికెటర్ల ముఖాలను పెట్టి ఇక ఏదో ఒక పోస్ట్ పెట్టడం ఇక అది కాస్త సోషల్ మీడియాలో సెన్సేషన్ గా  మారిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి.


 ఇకపోతే ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా విడుదలై ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే త్రిబుల్ ఆర్ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్ కుర్తా వేసుకొని  ఇక అటు రామ్ చరణ్ ఇన్ షర్ట్ వేసుకుని ఒక పోస్టర్ ఉంటుంది. ఇక ఇదే పోస్టర్ను ఇటీవల బాగా వాడేసారూ. నేడు ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే   అయితే టీమిండియాలో ఎంతో మంచి స్నేహితులుగా మెలిగిన విరాట్ కోహ్లీ మహేంద్రసింగ్ ధోని ఇక ఈ మ్యాచ్లో ప్రత్యర్థులుగా మారబోతున్నారు.


 ఈ క్రమంలోనే   ఇద్దరు స్టార్ క్రికెటర్లకు సంబంధించి ఇటీవల స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఒక ఫోటో రిలీజ్ చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ ఎన్టీఆర్ లా.. కోహ్లిని రామ్ చరణ్ లాగా మార్చి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఈ దోస్తీ కుస్తీలో అల్టిమేట్ యాక్షన్ తో అలరించడానికి సూపర్ స్టార్స్ ఇద్దరూ కూడా సిద్ధం అయ్యారు. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా అంటూ ఒక పోస్ట్ పెట్టడంతో ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్టు చూసిన అభిమానులు అందరూ కూడా ప్రస్తుతం ఎంతగానో ఆకర్షితులవుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl