చతేశ్వర్ పుజారా.. భారత జట్టులో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు.  ఇక భారత జట్టు ఎక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆ జట్టులో చటేశ్వర్ పుజారా స్థానం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఎంతో ననెమ్మదైనా ఆటతీరుకు కేరాఫ్ అడ్రస్ అయిన చటేశ్వర్ పుజారా కేవలం టెస్టు జట్టుకు మాత్రమే పరిమితమయ్యాడు. మిగతా ఫార్మాట్లకు దాదాపు దూరం అయిపోయాడు అనే చెప్పాలి. ఇలా టెస్ట్ స్పెషలిస్ట్ గా పేరు సంపాదించుకున్న చటేశ్వర్ పుజారా టెస్ట్ ఫార్మాట్లో సరిగ్గా రాణించలేక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే బీసీసీఐ పుజారాకు ఎన్నో సార్లు అవకాశాలు ఇచ్చినా  అవకాశాలను ఉపయోగించుకుని తనని తాను నిరూపించుకోలేక పోయాడు. పేలవా ప్రదర్శనతో జట్టుకు భారంగా మారుతూనే వచ్చాడు చటేశ్వర్ పుజారా. ఈ క్రమంలోనే బిసిసిఐ ఇక ఈ టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ ని కాస్త పక్కన పెట్టేసింది అన్న విషయం తెలిసిందే. మళ్లీ ఫాం నిరూపించుకున్న తర్వాతే జట్టులోకి తీసుకుంటామంటూ తేల్చి చెప్పింది. దీంతో మొన్నటివరకు రంజీల్లో  సెంచరీలతో చెలరేగిన పూజరా  ఇక ఇప్పుడు కౌంటీల్లో ఆడుతున్నాడు అన్న విషయం తెలిసిందే.


 కాగా ప్రస్తుతం ఈ సీనియర్ ప్లేయర్ ఫామ్ చూస్తూ ఉంటే మరికొన్ని రోజుల్లో భారత జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయం అనే విధంగానే కనిపిస్తూ ఉన్నాడు. అంతర్జాతీయ మ్యాచుల్లో పేలవ ప్రదర్శన చేయడం..  ఆ తర్వాత ఐపీఎల్ లో చోటు దక్కకపోవడంతో కౌంటీల్లో ఆడుతూ ఉన్నాడు చటేశ్వర్ పుజారా.  ఈ క్రమంలోనే బ్యాటింగ్ లో చెలరేగి పోతున్నాడు అనే చెప్పాలి. ససెక్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను ఇటీవలే డెర్హం తో జరిగిన మ్యాచ్ లో 128 పరుగులతో నాటౌట్గా నిలిచి అదరగొట్టాడు. అయితే కౌంటీ సీజన్లో చటేశ్వర్ పుజారా కు ఇది హ్యాట్రిక్ సెంచరీ కావడం గమనార్హం. దీంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన పూజరా అటు టీమిండియాలో చోటు దక్కడం ఖాయం అంటూ అభిమానులు అనుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: