ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీ ఎంత అరుదైన క్రికెటర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరూ క్రికెటర్లు ఒకలా అయితే అటు విరాట్ కోహ్లీ మాత్రం ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా బ్యాట్స్మెన్ లూ ఛేజింగ్ లో తడబడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఛేజింగ్ ఎక్కువ ఇష్ట పడుతూ ఉంటాడు. తన ముందు ఎంత పెద్ద టార్గెట్ వుంటే అంత అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. ఇక ఎక్కువ ఛేజింగ్ ఉన్నప్పుడు తనకు అసలు సిసలైన మజా వస్తుంది అని విరాట్ కోహ్లీ కూడా ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు అన్న విషయం తెలిసిందే.


 ఇలా తాను ఆడుతున్న జట్టు ఛేజింగ్ చేస్తున్న సమయంలో ఇప్పటివరకు ఎన్నో సార్లు భారీగా పరుగులు చేసి అదరగొట్టాడు విరాట్ కోహ్లీ. అందుకే ఇక ఛేజింగ్ చేసేటప్పుడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు దిగాడు అంటే చాలు ఇక అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు ప్రేక్షకులు. అయితే గత కొంత కాలం నుంచి మాత్రం విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం చివరికి తక్కువ పరుగులకే  వికెట్లు కోల్పోయి నిరాశ పరచడం లాంటివి చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే  తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు.


 అయితే ఇటీవలే ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించాడు అన్న విషయం తెలిసిందే. గుజరాత్ పై తప్పక గెలవాల్సిన మ్యాచులో విరాట్ కోహ్లీ 33 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక మొత్తంగా 73 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఛేజింగ్ లో మూడు వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సాధించాడు అని చెప్పాలి. ఇక ఈ ఘనత చూసిన తర్వాత విరాట్ కోహ్లీ కి ఛేజింగ్ అంటే ఎంత మక్కువ అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది అని అంటున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: