ప్రస్తుతం నేడు జరగబోయే ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ మ్యాచ్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు  ముఖ్యంగా టీమిండియా ఎలా రాణించ బోతుంది  అన్న దాని పైనే అందరి దృష్టి ఉంది. కారణం కెప్టెన్సీలో ఎలాంటి అనుభవం లేని జస్ప్రిత్ బూమ్రా చేతికి సారథ్యం బాధ్యతలు రావడమే. కపిల్ దేవ్ తర్వాత ఇక టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న ఏకైక ఫాస్ట్ బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, సంజూ శాంసన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఆటగాళ్లకు ఐపీఎల్లో కెప్టెన్సీ వహించిన అనుభవం ఉంది.


 కానీ జస్ప్రిత్ బూమ్రా కు మాత్రం ఐపీఎల్ లో మాత్రమే కాదు ఎక్కడ కెప్టెన్సీ వహించిన అనుభవం మాత్రం లేదు అని చెప్పాలి. తొలిసారి సారథ్య బాధ్యతలు నిర్వహించబోతున్నాడు జస్ప్రీత్ బుమ్రా. ఈ క్రమంలోనే తనకు కెప్టెన్సీ రావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కెప్టెన్సీ వహించడం తన కెరీర్లోనే అతిపెద్ద ఘనత అంటూ బూమ్రా చెప్పుకొచ్చాడు. ఎలాంటి అనుభవం లేకుండా నేను భారత జట్టు కెప్టెన్గా మారాను. అయితే ఇలా అనుభవం లేకుండానే కెప్టెన్గా మరి ఎన్నో గొప్ప విజయాలు సాధించిన ధోనీ నుంచి స్ఫూర్తి పొందుతున్నా అంటూ తెలిపాడు.


 ఒకసారి మహేంద్ర సింగ్ ధోనీతో జరిగిన సంభాషణ నాకు ఇంకా గుర్తుంది. భారత్ కు నాయకత్వం వహించడానికి ముందు తాను ఎప్పుడూ ఏ జట్టు కెప్టెన్గా  లేను అని ధోనీ నాతో చెప్పాడు.  అలాంటి ధోనీ ప్రస్తుతం అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు నా దృష్టి అంతా నేను జట్టును ఎలా ఉపయోగపడగలను అన్న విషయం పైనే ఉంది. ఇంతకుముందు నేను ఏం చేశాను అన్న విషయంపై కాదు అంటూ జస్ప్రిత్ బూమ్రా చెప్పుకొచ్చాడు. టెస్టుల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించడం నా కల.. ఇప్పుడు జట్టుకు నాయకత్వం వహించడం నా కెరీర్ లోనే పెద్ద ఘనత. ఈ అవకాశం నాకు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది.. జట్టు విజయం కోసం శాయశక్తులా కృషి చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: