ఇటీవలే ఆసియా కప్లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి అద్భుతమైన ఫామ్ కనబరచిన టీమిండియా ఆ తర్వాత కీలకమైన రెండు మ్యాచ్ లలో మాత్రం ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే. జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు గాయం కారణంగా దూరం అవుతున్న నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ బౌలింగ్ లైనప్ మొత్తం క్రమక్రమంగా బలహీన పడుతూ వచ్చింది. ఇకపోతే సూపర్ 4 లో అడుగుపెట్టిన టీమిండియా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఇటీవలే ఫైనల్లో అడుగుపెట్టాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కూడా టీమిండియా ఓడిపోయింది.


 ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్ చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్గా ఉండగా.. ఈ మ్యాచ్లో కూడా ఆరు వికెట్ల తేడాతో టీమ్ ఇండియా ఓటమి చవి చూడటం గమనార్హం. ఆసియా కప్ కి ముందు టీం ఇండియా కి ఎదురు దెబ్బ తగిలింది. కీలక బౌలర్ జస్ప్రీత్ గుండె గాయం బారినపడి జట్టుకు దూరమయ్యాడు. దీంతో భువనేశ్వర్ కుమార్  టీమిండియాలో సీనియర్ బౌలర్ గా ఉన్నాడు.  భువనేశ్వర్ కుమార్  నేతృత్వంలోనే అటు బౌలింగ్ విభాగం బాగా రాణిస్తోంది అని అందరూ అనుకున్నారు.


 ఇక బూమ్రా లేకపోవడంతో బౌలింగ్ విభాగం బాధ్యతలు మొత్తం భువనేశ్వర్ కుమార్ పైన పడ్డాయి. కానీ ఎంతో అనుభవం భువనేశ్వర్ కుమార్ మాత్రం టీమిండియా కొంపముంచాడు అన్నది తెలుస్తుంది. ఆసియా కప్లో అతని ప్రదర్శన పై విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ శ్రీలంక పై కీలకమైన 19 ఓవర్ వేసిన భువనేశ్వర్ ప్రత్యర్థులను కట్టడి చేయాల్సింది పోయి పరుగులు సమర్పించుకున్నాడు. పాకిస్థాన్తో మ్యాచ్లో 19 పరుగుల.. శ్రీలంకతో మ్యాచ్లో 12 పరుగులు ఇవ్వడంతో పాటు రెండు వైడ్స్ కూడా వేశాడు. ఒకవేళ భువనేశ్వర్ కుమార్ 19 ఓవర్ కట్టుదిట్టంగా వేసి ఉంటే టీమిండియా గెలిచింది అని ఎంతో మంది భావిస్తున్నారు. శ్రీలంకతో మ్యాచ్లో 20 ఓవర్ వేసిన అర్ష దీప్ పరుగులు కట్టడి చేసిన లాభం లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: