సాధారణం గా టీం ఇండియా సెలక్టర్లు కేవలం అవసరం మేరకు మాత్రమే ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నామని వివక్ష చూపించడం లేదు అంటూ చెబుతూ ఉంటారు. కానీ కొన్ని కొన్నిసార్లు మాత్రం సెలెక్టర్లు వ్యవహరించే తీరు మాత్రం కొంత మంది ఆటగాళ్ల పట్ల సెలక్టర్లు  నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు అని  మాత్రం అందరికీ అర్థమవుతు ఉంటుంది. ఒక ఆటగాడుకి సంబంధించిన వార్త హాట్ టాపిక్ గా మారి పోయింది అని చెప్పాలి. ఇటీవలే గాయం కారణం  గా జట్టుకు దూరమయ్యాడు కేఎల్ రాహుల్.


 ఫిట్నెస్ సాధించి ఇటీవలే మళ్లీ జట్టులోకి వచ్చాడు. రాహుల్ జట్టులోకి వచ్చినప్పటి నుంచి ఒక ఆటగాడునీ మాత్రం టీమిండియా సెలెక్టర్లు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. రాహుల్ రావడం తో అతను జట్టు లో అస్సలు కనిపించడం లేదు. ఇటీవల జరిగిన ఆసియా కప్ లో కూడా అతనికి చోటు దక్కలేదు. అయితే కె.ఎల్.రాహుల్   జట్టు లోకి రావడానికి ముందు  చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఎందుకో ఆసియా కప్ లో మాత్రం అతను అవకాశం దక్కించు కోలేక పోయాడు అని చెప్పాలి.


 ఇప్పుడు వరకు టీం ఇండియా తరఫున 19  టి20 మ్యాచ్లు ఆడిన ఇషాన్ కిషన్ మొత్తంగా  543 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉండడం గమనార్హం.  అంతేకాదు ఎన్నోసార్లు స్టాండ్ బై కూడా జట్టుకు సెలెక్ట్ అయ్యాడు.  ఇప్పుడు మాత్రం అతని జట్టులోకి రావడం ఎంతో కష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ కప్కు ముందు ఆస్ట్రేలియాతో, దక్షిణాఫ్రికాతో సిరీస్ లు ఆడబోతుంది టీమ్ ఇండియా.  ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే టీమిండియాలో చోటు దక్కించుకోవడం ఎంత కష్టం గా మారిపోయింది అని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే సెలెక్టర్లు అందరికీ మొదటి ఎంపిక కేఎల్ రాహుల్  కాబోతున్నాడు అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: