క్రికెట్ అంటే అన్ని ఆటల లాగానే ఒక సాదాసీదా ఆట మాత్రమే. కానీ భారత్ లో మాత్రం అలా కాదు క్రికెట్ అనేది భారత జాతీయ క్రీడ కాకపోయినప్పటికీ అటు అభిమానులు మాత్రం ఎంతలా ఆస్వాదిస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెటర్లను దేవుడిలా ఆరాధిస్తూ ఉంటారు భారత ప్రేక్షకులు. ఇక ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా అటు భారత్ లో క్రికెట్ కి క్రేజ్ ఉంది అని చెప్పడం లో అభిషేక్ లేదు అని చెప్పాలి.. అందుకే టీమిండియా ఎక్కడ మ్యాచ్ ఆడిన కూడా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు అని చెప్పాలి. తమ అభిమాన క్రికెటర్ ఎక్కడికైనా వస్తున్నాడు అంటే చాలు అక్కడికి భారీగా తరలి వెళ్లి తమ అభిమాన క్రికెటర్ ని  ఒక్కసారి కలిస్తే చాలు అని ఎంతో మంది అభిమానులు కోరుకుంటున్నారు. తమకు దగ్గరలో ఉన్న మైదానంలోకి తమ అభిమాన క్రికెటర్ మ్యాచ్ ఆడటానికి వస్తున్నాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో స్టేడియం కు వెళ్లి మ్యాచ్ వీక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. గతంలో ఆసియా కప్ సమయంలో ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోసం ఏకంగా పాకిస్తాన్  అభిమానులు సైతం కలవడానికి రావడం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఇకపోతే ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ ముగించుకున్న టీమిండియా  నేటి నుంచి అటు సౌత్ ఆఫ్రికా తో టి20 సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. కాగా రోహిత్ శర్మ అభిమానులు అందరూ కూడా తమ అభిమానాన్ని సరికొత్తగా చాటుకున్నారు. సౌత్ ఆఫ్రికా తో తొలి టి20 జరిగే తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం ఎదుట ఆల్ కేరళ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు రోహిత్ శర్మకు సంబంధించి భారీ కటౌట్  ఏర్పాటు చేశారు అని చెప్పాలీ. ఇంకోవైపు విరాట్ కోహ్లీ కటౌట్ సైతం సిద్ధం చేశారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: