బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన అమీర్ ఖాన్ గత ఏడాది అభిమానులకు ఒక ఊహించని సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. 60 ఏళ్ల వయసులో తనకు గర్ల్ ఫ్రెండ్ ఉందని బర్తడే రోజున చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. బెంగళూరు ప్రాంతానికి చెందిన గౌరీ తన ప్రియురాలి అంటూ అభిమానులకు పరిచయం చేశారు. ఆ తర్వాత వీరిద్దరు ఎక్కడికి వెళ్ళినా కూడా జంటగానే కనిపించారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి పెళ్లిపైన పలు రకాల వార్తలు బాలీవుడ్లో వినిపిస్తున్నాయి.


ఈ నేపథ్యంలోనే అమీర్ ఖాన్ తాజాగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా గౌరీ తో రిలేషన్ షిప్ పై మాట్లాడుతూ గౌరీని వెంటనే వివాహం చేసుకోవాలని ప్రణాళిక లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను గౌరీ ఒకరి పట్ల ఒకరం చాలా నిబద్ధతతోనే కలిగి ఉన్నామని తెలియజేశారు. ప్రస్తుతం మేమిద్దరం భాగస్వామ్యులమే, మేమిద్దరం కలిసే ఉన్నామని , పెళ్లి విషయానికి వస్తే ఆమెను నా మనసుతో ఇప్పటికే వివాహం చేసుకున్నాను అంటూ తెలియజేశారు. పెళ్లిని అధికారికంగా చేసుకోకపోయినా.. అలా చేసుకోవాల వద్ద అనేది భవిష్యత్తులో ఇద్దరం కలిసి నిర్ణయించుకుంటామంటూ అమీర్ ఖాన్ తెలియజేశారు.  


అమీర్ ఖాన్, గౌరీ గత కొన్ని నెలలుగా డేటింగ్ చేస్తున్నారు. గత ఏడాది అమీర్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా తన రిలేషన్ ని అఫీషియల్ గా తెలియజేశారు ముంబైలో ఒక విలాసవంతమైన ఇంటికి మారుతున్నట్లుగా తెలియజేశారు ఈ జంట. అమీర్ ఖాన్  మొదట రీనాదత్తాను వివాహం చేసుకోగ వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలా 16 సంవత్సరాల తర్వాత 2002లో ఈ జంట విడిపోయారు. 2005లో కిరణ్ రావ్ ను వివాహం చేసుకున్న అమీర్ ఖాన్ కు సరోగసి ద్వారా ఒక కుమారుడు జన్మించారు.అనంతరం 2021 లో విడిపోయారు. అలా ఇద్దరితో విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్ ఇప్పుడు మరొకసారి గౌరీ తో రిలేషన్ లో ఉన్నారు. అయినా కూడా ఇప్పటికి తన ఇద్దరు భార్యలతో స్నేహపూర్వకంగానే ఉన్నారు అమీర్ ఖాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: