ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో 'సంక్రాంతి విన్నర్ మీట్' నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో అనిల్ సుంకర మాట్లాడుతూ.. "శర్వానంద్ పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూనే, బాక్సాఫీస్ వద్ద మాస్ రేంజ్ హిట్ కొట్టగలడు. ఈ సినిమాతో అది మరోసారి ప్రూవ్ అయ్యింది" అని కొనియాడారు. 'సామజవరగమన' తర్వాత రామ్ అబ్బరాజు మళ్ళీ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేశారని, ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో ఆయన సక్సెస్ అయ్యారని అనిల్ సుంకర ప్రశంసించారు.
ఈ చిత్రం కేవలం 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹22 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఇండియా నెట్ కలెక్షన్లు దాదాపు ₹15 కోట్లకు చేరువయ్యాయి.అమెరికాలో కూడా శర్వానంద్ తన మార్కెట్‌నునిరూపించుకున్నారు. దాదాపు ₹6 కోట్ల గ్రాస్ ఓవర్సీస్ నుంచి రావడం విశేషం.సంక్రాంతి సెలవులు పూర్తయినా, మధ్యాహ్నం మరియు సాయంత్రం షోలకు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడుతుండటంతో థియేటర్ల వద్ద సందడి తగ్గడం లేదు.ఈ సినిమా సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషించింది ఇందులోని కామెడీ. 60 ఏళ్ల వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకునే తండ్రి పాత్రలో వి.కె. నరేష్ చేసిన రచ్చ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించింది.సంయుక్త మీనన్, సాక్షి వైద్యలు కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, నటనతోనూ మెప్పించారు. ఎక్కడా అసభ్యత లేకుండా, కేవలం సిట్యుయేషనల్ కామెడీతో సినిమాను నడిపించడం వల్ల మహిళా ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.
సినిమా లాభాల్లోకి రావడంతో అనిల్ సుంకర చిత్ర యూనిట్ మొత్తానికి ఒక స్పెషల్ పార్టీ ఇచ్చారు. విజయవాడ, వైజాగ్ వంటి మాస్ సెంటర్లలో కూడా సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి డిస్ట్రిబ్యూటర్లు పండగ చేసుకుంటున్నారు. "ఈ సినిమా కేవలం ఒక హిట్ మాత్రమే కాదు, మంచి కంటెంట్ ఉంటే ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారని చెప్పడానికి ఒక నిదర్శనం" అని అనిల్ సుంకర ముగించారు.మొత్తానికి 'నారీ నారీ నడుమ మురారి' పేరుకు తగ్గట్టుగానే శర్వానంద్‌ను ఇద్దరు భామల మధ్య మురారిగా చూపించి, ప్రేక్షకులకు ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. అనిల్ సుంకర బ్యానర్‌లో మరో క్లాసిక్ హిట్ నమోదైంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి