ఏం మాట్లాడుతున్నారు బ్రో.. నరాలు కట్ అయిపోయాయి.. సూర్య కుమార్ యాదవ్ కెరియర్ గౌతమ్ గంభీర్ పాడు చేయడం ఏంటి.. భారత క్రికెట్ లో ఇలాంటి ఒక యాంగిల్ కూడా ఉందా అని అనుకుంటున్నారు కదా. అయితే సూర్య కుమార్ యాదవ్ గొప్ప బ్యాట్స్మెన్గా ఎదగకుండా అటు గౌతమ్ గంభీర్ ఎలా అడ్డుకున్నాడు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక ఇలాంటి విషయం తెలుసుకునే ముందు గ్రేట్ బాట్స్మన్ మిస్టర్ 360 సూర్యకుమార్ గురించి కాస్త ఇంట్రో లేకపోతే ఎలా. సూర్య కుమార్ గురించి ఇంట్రడక్షన్ చూసుకుంటే..


 ప్రస్తుతం ప్రత్యర్థి జట్లకు ఇతని పేరు వింటే చాలు నిద్ర కూడా పట్టడం లేదు. ఎందుకంటే అతని మెరుపు ఇన్నింగ్స్ లు అలా ఉంటున్నాయి. ఒకవేళ టీమ్ ఇండియా తో మ్యాచ్ ఆడితే సూర్యకుమార్  వికెట్ ఎలా పడగొట్టాలి అని ప్రత్యర్థి జట్లు అందరూ కూడా ఇతని కోసం పక్కా ప్లాన్ తో బరిలోకి దిగుతున్నాయి. టి20 వరల్డ్ కప్ లో టీమిండియా విజయంలో సూర్యకుమార్ ఎంతో   కీలకంగా మారిపోతాడు అనేది ప్రస్తుతం అందరూ చెబుతున్న మాట. చివరిగా 2007లో టి20 వరల్డ్ కప్ కొట్టిన టీమిండియా అప్పటినుంచి ఇప్పటివరకు నిరాశ పరుస్తూనే ఉంది. ప్రస్తుతం టీమిండియాలో మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్న సూర్య కుమార్ కొన్నేళ్ల కిందటే టీమిండియాలో స్థానం దక్కాల్సిందట.


 అయితే గౌతమ్ గంభీర్  కారణంగానే ఆరేళ్లు ఆలస్యంగా టీమిండియా జట్టులోకి వచ్చాడు అన్నది తెలుస్తుంది. ఐపీఎల్ లో కేకేఆర్ జట్టు తరఫున సూర్య కుమార్ ఆడేవాడు. ఇక అప్పుడు కోల్కత్తా జట్టు కెప్టెన్లు గౌతమ్ గంభీర్ ఉన్నాడు. ఇతని సారథ్యంలోనే జట్టు రెండు సార్లు కప్పు గెలిచింది. అయితే సూర్య కుమార్ ప్రతిభావంతుడైన బ్యాట్స్మెన్ అని తెలిసినప్పటికీ గౌతమ్ గంభీర్ అతనికి చాలా తక్కువ అవకాశాలు కల్పించే వాడట. ఇలా సూర్యకుమార్ ప్రతిభ గుర్తించినప్పటికీ గౌతమ్ గంభీర్ అతన్ని ఎంకరేజ్ చేయకపోవడం ఇక తెర మీదకి రాలేదట. కానీ ఎప్పుడైతే ముంబై ఇండియన్స్ లోకి వచ్చాడో.. రోహిత్ శర్మ అతన్ని బాగా ఎంకరేజ్ చేశాడు. తరచూ తుదిజట్టులో అవకాశం కల్పించాడు. తద్వారా తన ప్రతిభ నిరూపించుకుని ఇక ఇప్పుడు టీమిండియాలో కీలక బ్యాట్స్మెన్ గా మారిపోయాడు సూర్య కుమార్ యాదవ్.

మరింత సమాచారం తెలుసుకోండి: