డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా వేదికగా టీ 20 వరల్డ్ కప్ ఎంతో విచిత్రమైన ఫలితాలతో జరుగుతూ ఉంది. సూపర్ 12 లో ఇప్పటి వరకు 14 మ్యాచ్ లు షెడ్యూల్ ప్రకారం జరగాల్సి ఉండగా, అందులో సక్సెస్ ఫుల్ గా ఫలితం వచ్చినవి 10 మ్యాచ్ లు మాత్రమే. ఈ పదిలో కూడా ఒక్క మ్యాచ్ డి ఎల్ ఎస్ పద్దతిలో ఫలితం నిర్ణయించబడింది. ఇక వర్షం కారణంగా నాలుగు మ్యాచ్ లు ఫలితం తేలకుండానే ముగిశాయి. తద్వారా ఇరు జట్లు ఒక్కో పాయింట్ ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ వర్షం వలన రద్దైన మ్యాచ్ ల కారణంగా సెమీఫైనల్ స్థానాలు అనుకున్నట్లు కాకుండా వేరేగా మారేలా కనిపిస్తున్నాయి. ఈసారి చిన్న జట్లకు వర్షాలు పడడం చాలా అదృష్టం అని చెప్పాలి. ఇక టైటిల్ ఫేవరెట్ లుగా చెప్పుకుంటున్న ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా లు సెమీస్ చేరుతాయా అన్న ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నం అవుతోంది.

ఎందుకంటే ఈ రోజు ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షార్పణం అయింది. ప్రస్తుతం ఈ రెండు జట్లకు తలో మూడు మ్యాచ్ లు జరిగిపోయినట్లే లెక్క.  అందులో ఒకటి గెలిచి , మరొకటి ఓడి మరియు ఇంకొక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. అలా రెండు జట్లు మూడు మ్యాచ్ ల తర్వాత మూడు పాయింట్ లతో గ్రూప్ 1 లో ఇంగ్లాండ్ రెండవ స్థానంలో మరియు ఆస్ట్రేలియా నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక మిగిలింది రెండు మ్యాచ్ లు మాత్రమే... ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మరియు శ్రీలంకలతో ఆడనుంది.. ఈ రెండు మ్యాచ్ లను ఇంగ్లాండ్ గెలిస్తే 7 పాయింట్లు వస్తాయి. అదే విధంగా ఆస్ట్రేలియా తర్వాత ఆఫ్గనిస్తాన్ మరియు ఐర్లాండ్ లతో ఆడుతుంది. రెండు మ్యాచ్ లను గెలిస్తే 7 పాయింట్లు వస్తాయి.

ఇక ఇదే గ్రూప్ లో న్యూజిలాండ్ మరియు శ్రీలంకలకు మూడు మ్యాచ్ లు ఉన్నాయి. మూడు లో రెండు గెలిచినా ఏడు పాయింట్లు వస్తాయి. శ్రీలంక మాత్రం తన తర్వాత మూడు మ్యాచ్ లు గెలిస్తేనే సెమిస్ చేరుతుంది.. ఒకటి ఓడినా మిగిలిన జట్ల మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాలో. ఒకవేళ ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ లకు ఉన్న రెండు మ్యాచ్ లలో ఒకటి వర్షార్పణం అయినా సెమీస్ చేరటం కష్టమే అవుతుంది. మరి ఆ రెండు జట్లను వరుణుడు కరుణిస్తాడా ?  

మరింత సమాచారం తెలుసుకోండి: