ఇండియా టీ 20 వరల్డ్ కప్ 2022 లో సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఓటమి పాలై ఫైనల్ కు చేరకుండా మరోసారి టైటిల్ ను పోగొట్టుకుని కోట్లాదిమంది అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత జరుగుతున్న సిరీస్ న్యూజిలాండ్ తోనే, ఇందులో టీ 20 సిరీస్ ను గెలుచుకుని ద్వైపాక్షిక సిరీస్ లో మరోసారి తమకు తిరుగులేదని నిరూపించింది. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ , షమీ మరియు బుమ్రా లు రెస్ట్ తీసుకోవడంతో హార్దిక్ పాండ్య అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగి సిరీస్ ను దక్కించుకున్నాడు. ఇక వన్ డే సిరీస్ కు కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్ పై ఇప్పుడు భారం పడింది అని చెప్పాలి. మూడు వన్ డే ల సిరీస్ లో ఇప్పటికే మొదటి వన్ డే లో ఓడిపోయి సిరీస్ కు వెనుకంజలో ఉంది.

ఇక సిరీస్ దక్కాలి అంటే ఖచ్చితంగా మిగిలిన రెండు వన్ డే లు గెలవాల్సి ఉంది. అందులో భాగంగా రెండవ వన్ డే రేపు హామిల్టన్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లోనూ టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ చేయడానికి మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా న్యూజిలాండ్ ఫేవరెట్ అని చెప్పాలి, ఎందుకంటే బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండు విభాగాలలోనూ పటిష్టంగా ఉంది. ఇండియాకు విజయం దక్కాలంటే న్యూజిలాండ్ ఆటగాళ్లలో కెప్టెన్ విలియమ్సన్ మరియు కీపర్ లాతమ్ లను అడ్డుకోవాలి. ఎందుకంటే వీరిద్దరూ నెమ్మదిగా ఆడుతూనే మ్యాచ్ ను లాగేసుకుంటారు.

కాబట్టి ఇండియా కెప్టెన్ శిఖర్ ధావన్ తన అమ్ముల పొదిలో ఉన్న అన్ని అస్త్రాలను వాడుకుని వీరిని క్రీజులో కుదురుకోకుండా అవుట్ చెయ్యాలి. ఇక మ్యాచ్ కు ముందు వీరిద్దరి నెగేటివ్స్ ఏమిటన్నది తెలుసుకుని అందుకు తగినట్లుగా వనరులను వాడుకుని అవుట్ చెయ్యాలి. ఇక బౌలర్లు కూడా వికెట్ తీయడానికి అనువుగా బాల్స్ ను సంధించాలి. ఒకవేళ రేపు మ్యాచ్ లో ఓడిపోతే 2023 వన్ డే వరల్డ్ కప్ ముందు ఇండియా టీం యాజమాన్యం ముందు చాలా ప్రశ్నలు తలెత్తుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: