వాటిలో మెల్బోర్న్ స్టార్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ , సిడ్నీ సిక్సర్స్, బ్రిస్బేన్ హీట్, మెల్బోర్న్ రేనీగేడ్స్ , హోబర్ట్ హర్రికన్స్ , సిడ్నీ థండర్స్ మరియు పెర్త్ స్కార్చర్స్ లు ఉన్నాయి. అయితే ఎప్పటిలాగే ఈ టోర్నీ టైటిల్ ఫేవరెట్ గా సిడ్నీ సిక్సర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మరియు పెర్త్ స్కార్చర్స్ బరిలోకి దిగనున్నాయి. కాగా ఈ రోజు మెల్బోర్న్ స్టార్స్ మరియు సిడ్నీ థండర్స్ మధ్యన మ్యాచ్ జరుగుతోంది. మెల్బోర్న్ స్టార్స్ రెగ్యులర్ కెప్టెన్ మాక్స్వెల్ కు గాయం కావడంతో ఈ సీజన్ కు దూరమయ్యాడు, దానితో అతని స్థానంలో స్పిన్నర్ ఆడం జంపా కెప్టెన్ గా బాధ్యతలను నిర్వహించనున్నారు. ఇక మార్కస్ స్థాయినిస్ వైస్ కెప్టెన్ గా ఉండనున్నాడు.
టాస్ గెలిచిన థండర్స్ కెప్టెన్ జాసన్ సంఘా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు స్వర్గధామం అయిన ఈ కాన్ బెర్రా పిచ్ పై ముందుగా స్టార్స్ ఏ మాత్రం టార్గెట్ ను ఇవ్వనున్నారో చూడాలి. ఇండియాలో ఉన్న అభిమానులు బిగ్ బాష్ లీగ్ ను మీరు వీక్షించాలంటే సోనీ టీవీ లో లైవ్ చూడొచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి