గత కొంత కాలం నుంచి భారత జట్టు జైత్రయాత్రను కొనసాగిస్తూ వస్తుంది అని చెప్పాలి. వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లలో ఆడుతూ ఉంది. ఈ క్రమం లోనే ఇక అన్ని ఫార్మాట్లలో కూడా సిరీస్లో గెలుచుకుంటూ ఇక తిరుగు లేని ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. ఒకవేళ టీమ్ ఇండియా విదేశీ పర్యటనకు వెళ్ళినా లేకపోతే విదేశీ జట్టు అటు భారత పర్యటనకు వచ్చినా కూడా ఒకే విధమైన ఆధిపత్యం కొనసాగిస్తుంది టీమ్ ఇండియా.


 ముఖ్యం గా 2023 ఏడాది లో అయితే శుభారంభం  చేసింది అని చెప్పాలి  ఏకంగా టీమిండియా పర్యటనకు వచ్చిన శ్రీలంక తో రెండు సిరీస్లలో విజయం సాధించిన టీమిండియా ఇక ఆ తర్వాత స్వదేశం లో న్యూజిలాండ్తో కూడా వన్డే సిరీస్ గెలుచుకుంది. ఏకంగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి న్యూజిలాండ్ ను క్లీన్ చేసింది అని చెప్పాలి. ఇకపోతే ఇక న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ గెలిచిన జోరునే టి20 సిరీస్ లో కూడా చూపిస్తుందని అందరూ అనుకున్నారు.


 కానీ టి20 సిరీస్ లో మాత్రం ఎందుకో టీమిండియా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేక పోయింది. మొదటి వన్డే మ్యాచ్ లోనే న్యూజిలాండ్ చేతిలో ఓడి పోయింది అని చెప్పాలి. దీంతో అభిమానులు నిరాశలో మునిగి పోయారు. అయితే న్యూజిలాండ్ చేతిలో మొదటి వన్డేలో ఎందుకు ఓడి పోయాము అనే విషయం పై హార్దిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాంచి పిచ్ పై 177 పరుగులు ఇవ్వడం సరైంది కాదు. మేము బౌలింగ్లో తడబడ్డాము. 25 పరుగులు ఎక్కువగా ఇవ్వడం వల్ల ఓడిపోయాం. నేను, సూర్య లో ఉన్నప్పుడు గెలుస్తాం అనుకున్నాం. కానీ పరిస్థితులు ఒక్క సారిగా మారి పోయాయి. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ బౌలింగ్ ఫీలింగ్ లలో కూడా రానించాడు. అతను సూపర్ అంటూ హార్దిక్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: