ప్రస్తుతం భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టింది . జూన్ 7వ తేదీన ఇక డబ్ల్యూటీసి ఫైనల్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ ఫైనల్ మ్యాచ్ జరగడానికి ఇంకా చాలా రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పటినుంచే ఎంతోమంది మాజీ ఆటగాళ్లు డబ్ల్యూటీసి ఫైనల్ ఆడబోయే భారత జట్టులో తుది జట్టులో ఎవరు ఉంటే బాగుంటుంది అని దానిపై తెగ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి.  అయితే ఇక భారత్కు రెగ్యులర్ వికెట్ కీపర్ గా ఉన్న రిషబ్ పంత్ ఇక యాక్సిడెంట్ భారిన పడి క్రికెట్కు దూరంగా ఉన్నాడు.



 దీంతో జట్టులో కొనసాగే వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ ఎవరు అనే విషయంపై చర్చ జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం జట్టుకు కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ రూపంలో రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి  ఇద్దరిలో ఎవరు తుది జట్టులో ఎవరుంటే బాగుంటుంది అనే విషయంపై ఇప్పటికే ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయ వ్యక్తం చేశారు. ఇక ఇటీవల టీమిండియా మాజీ సెలెక్టర్ సభ కరీం సైతం ఇదే విషయంపై స్పందించాడు. తుది జట్టు ఎంపిక అన్నది పూర్తిగా సెలక్షన్ కమిటీ నిర్ణయమే.. కానీ జట్టులో ఎవరు ఉండాలి అనే విషయంపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఇటీవల కాలంలో జట్టి యాజమాన్యం ఎక్కువగా యువకులకు అవకాశం ఇస్తుంది.



 వారిలో అభద్రతాభావం పోయేలా చేస్తుంది.  ఆటగాళ్ల ప్రదర్శన పట్ల కఠినంగా వ్యవహరించడం లేదు. టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన యంగ్ క్రికెటర్ల పై నమ్మకం ఉంచింది జట్టు యాజమాన్యం. కేఎల్ రాహుల్ కేవలం బ్యాట్స్మెన్ గా మాత్రమే జట్టులోకి తీసుకోవచ్చు. అంతేగాని రిషబ్ అంత లేడని అతని స్థానంలో రాహుల్కు అవకాశం ఇవ్వడం సరి అయింది కాదు. యువ క్రికెటర్ కు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. కె.ఎస్ భరత్ కు భారత మేనేజ్మెంట్ మరిన్ని అవకాశాలు ఇస్తుందని భావిస్తున్న. ఇంగ్లాండ్లో పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. ఇలాంటి పిచ్ పై ఆడటం యువ క్రికెటర్ కు సవాలతో కూడుకున్నదే. అయితే భరత్ వికెట్ల వెనుక అద్భుతంగా రాణిస్తున్నాడు. మరి కొన్ని అంశాల్లో మెరుగుపడాల్సి ఉంది. అయితే అతడిని సన్నదం చేయడానికి భారత్ మరింత అవకాశాలు ఇవ్వాలి. అప్పుడే అతను తన ఆటను మరింత మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంటుంది అంటూ సభ కరీం అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: