
అయితే ఈ ఏడాది మాత్రం భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రపంచకప్ లో ఎప్పటిలాగానే అటు భారత జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉంది. అయితే ఈ ప్రపంచకప్ భారత్లో జరుగుతూ ఉండడంతో ఇక టీమిండియా కు కాస్త కలిసివచ్చే అవకాశం ఉంది అని చెప్పాలి. కాగా ఇక వరల్డ్ కప్ సమీపిస్తున్న సమయంలో అటు టీమ్ ఇండియాలో నాలుగవ స్థానం బ్యాటర్ కి సంబంధించిన ఆందోళన మాత్రం తీవ్రతరం అవుతుంది. శ్రేయస్ అయ్యర్ నాలుగవ స్థానంలో నమ్మదగిన బ్యాట్స్మెన్ గా ఉండేవాడు.
కానీ అతను వెన్నునొప్పి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక వరల్డ్ కప్ నాటికి అందుబాటులో ఉంటాడో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. అయితే అతని స్థానంలో చోటు దక్కించుకున్న సూర్య కుమార్ యాదవ్ టి20 ఫార్మాట్లో లాగా మెరుపులు మెరిపించడం లేదు. రాబోయే వన్డేలలో భారత క్రికెట్ జట్టు కూడా సంజు శాంసన్ ని నాలుగవ నెంబర్ లో బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు వరుసగా వన్డే మ్యాచ్ లో ఆడించడం ద్వారా అతన్ని ఇక ప్రపంచకప్ నాటికి సంసిద్ధం అయ్యే ఛాన్స్ ఉందని బీసీసీఐ భావిస్తుందట. ఇప్పుడు వరకు 11 వన్డేలు ఆడిన సంజూ పది మ్యాచ్ లలో బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే 66 సగటుతో 330 పరుగులు చేశాడు.. అత్యధిక స్కోరు 86 కావడం గమనార్హం. ఇలా సూర్య కుమార్ తో పోజు చూస్తే మంచి గణాంకాలు ఉన్న సంజు కే ఇక నాలుగవ స్థానంలో బ్యాటింగ్ బాధ్యతలను అప్పగించబోతున్నట్లు సమాచారం.