ఇటీవల ఐపీఎల్ 2023లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో రహానేకు ధోని అవకాశం కల్పించాడు. ఇక ఈ మ్యాచ్ లో రహానే చెలరేగిపోయాడు. 19 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించి చెన్నై విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. అయితే ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేయాలని.. ఇక నమ్మకం పెట్టుకొని నేను ముందు పంపిస్తున్నాను అంటూ ధోని తనతో మాట్లాడాడు అంటూ మ్యాచ్ ముగిసిన తర్వాత రహానే చెప్పుకొచ్చాడు. అయితే ఇక ఇప్పుడు జట్టుకు అవసరమైన సమయంలో రహానేను తుది జట్టులో ఆడించిన ధోని టీమిండియాకు ఆడే సమయంలో రహానేను ఎందుకు తప్పించాడు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించాడు.
ఏ క్రికెటర్ కైనా సరే టీం మేనేజ్మెంట్ నుంచి మద్దతు ఎంత అవసరం. అయితే చెన్నై సూపర్ కింగ్స్ లో ఆటగాళ్లకు మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్న ధోని.. టీమ్ ఇండియాలో ఉన్నప్పుడు రహానేకు ఎందుకు మద్దతు ఇవ్వలేదు అంటూ నిలదీశాడు. ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు రహానేను వన్డే ఫార్మాట్లో పక్కన పెట్టాడని.. అతను స్లోగా ఆడుతున్నాడని.. స్ట్రైక్ రొటేట్ చేయడం లేదని.. రహనేను జట్టు నుంచి తప్పిస్తున్నట్లు ధోనీ కారణం చెప్పాడు అని వీరేంద్ర సెహ్వాగ్ గుర్తు చేశాడు. ఇప్పుడు చెన్నై తరపున ఆడెందుకు అడ్డురాని స్ట్రైక్ రేట్ టీమ్ ఇండియాలో ఆడేందుకు అడ్డు వచ్చిందా అని ధోని ప్రశ్నించాడు. ఇప్పుడు మ్యాచ్ కు ముందు రహానేని మోటివేట్ చేసినట్లే.. టీమిండియా తరఫున ఆడేటప్పుడు కూడా మోటివేట్ చేసి ఉంటే సరిపోయేది కదా అంటూ వ్యాఖ్యానించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి