ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే లీగ్ మ్యాచ్ లు దగ్గర పడుతున్న కొద్దీ ఇక ప్రతి జట్టు కూడా పాయింట్లు పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్ కి అర్హత సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు ఎంతో పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకుని బరిలోకి దిగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు బీసీసీఐ కేవలం ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే విడుదల చేసింది.



 ఐపీఎల్ లోని ప్లే ఆఫ్ మ్యాచ్ లను ఎక్కడ నిర్వహిస్తారు.. ఏ ఏ తేదీలలోఈ మ్యాచ్ లు ఉండబోతున్నాయి అన్న విషయంపై మాత్రం ఎవరికీ స్పష్టత లేదు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం లీగ్ మ్యాచ్లు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక ఇటీవల బిసిసిఐ ఐపీఎల్ లో ప్లే ఆప్ ఫైనల్ మ్యాచ్ లకు సంబంధించిన షెడ్యూల్ ను వేదికలను కూడా ప్రకటించింది. ఇక ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఇక బిసిసిఐ ప్రకటించిన ఐపీఎల్ ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్ల షెడ్యూల్ వివరాలను చూసుకుంటే..

 మే 23వ తేదీన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ చెన్నై లోని చపాక్ స్టేడియం వేదికగా జరగబోతుంది.

 మే 24వ తేదీన అదే చెపాక్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది అని చెప్పాలి.

 మే 26వ తేదీన రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది.

 మే 28వ తేదీన అందరూ ఎదురుచూసే ఫైనల్ మ్యాచ్ కీ కూడా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతుంది అన్నది తెలుస్తుంది.

 ఇకపోతే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అన్ని జట్లు కూడా మెరుగైన ప్రదర్శన చేస్తూ ఉన్నాయి. దీంతో టైటిల్ విజేతగా ఎవరు నిలుస్తారు అనే విషయంపై ఒక క్లారిటీ కి రాలేకపోతున్నారు ప్రేక్షకులు, విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl