
అయితే ఇక సీనియర్ క్రికెటర్ అని ముద్ర పడటంతో వృద్ధిమాన్ సాహ భారత జట్టుకి పూర్తిగా దూరమైపోయాడు అని చెప్పాలి. జట్టులో అవకాశం వస్తుందేమో అని ఎదురుచూస్తున్న.. భారత సెలక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోలేదు. అయితే ఇక ఇటీవలే ఐపీఎల్లో మాత్రం అతను అదరగొట్టాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ఎన్నో మెరుపు ఇన్నింగ్స్ లు కూడా ఆడాడు. తాను కేవలం టెస్ట్ క్రికెట్కు మాత్రమే కాదు పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి కూడా సరిపోతాను అన్న విషయాన్ని నిరూపించాడు వృద్ధిమాన్ సాహ. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాలో అవకాశం వస్తుందేమో అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు.
ఇక వృద్ధిమాన్ సాహ ప్రదర్శన గురించి స్పందించిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహకు అవకాశం ఇస్తే.. సంతోషిస్తాను అంటూ సౌరబ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. పంత్, రాహుల్ అందుబాటులో లేకపోవడంతో సాహ సేవలను వినియోగించుకోవాలి అంటూ సూచించాడు. అయితే ఈ విషయం సెలెక్టర్ల పరిధిలో ఉంది అంటూ తెలిపాడు. కాగా వృద్ధిమాన్ సాహ అటు డబ్ల్యుటిసి ఫైనల్లో చోటు దక్కలేదు. అటు కేఎస్ భరత్ కు జట్టులో చోటు దక్కగా.. అతనికి బ్యాకప్ వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ ను సెలెక్ట్ చేశారు.