మరికొన్ని రోజుల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఐసీసీ ఫైనల్ మ్యాచ్లో భాగంగా అటు ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య హోరా హోరి పోరుకు అంత సిద్ధమవుతుంది. ఇంగ్లాండ్లోని ఓవల్ మైదానం వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మ్యాచ్ జరగబోతుంది. ఈ క్రమంలోనే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రస్తుతం ఒకవైపు ఆస్ట్రేలియా మరోవైపు భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్ గడ్డపై అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే గత ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయింది టీమిండియా జట్టు. దీంతో కేవలం రన్నరప్ తో మాత్రమే సరిపెట్టుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది మాత్రం ఎలాంటి తప్పు చేయకుండా విశ్వవిజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. అయితే ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా హాట్ ఫేవరెట్  గానే ఉంది అని చెప్పాలి. అయితే ఒకవేళ ఈ డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా గెలిస్తే ఇక ప్రపంచ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే వన్డే, టి20,  ఫార్మాట్లలో వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది టీమిండియా జట్టు. కానీ టెస్ట్ ఫార్మాట్లో మాత్రం ఇప్పటివరకు విశ్వ విజేతగా నిలవలేకపోయింది. ఒకవేళ జనవరి 7వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాని ఓడించి విజయం సాధించింది అంటే ఇక టెస్ట్ ఫార్మాట్లో కూడా వరల్డ్ ఛాంపియన్గా నిలిచినట్లు  అవుతుంది. ఈ క్రమంలోనే ఇలా మూడు ఫార్మాట్లలో వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టిస్తుంది టీం ఇండియా. అయితే ఒకవేళ ఇదే మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచినా కూడా మూడు ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలు గెలిచిన తొలి జట్టు అవుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc