ప్రస్తుతం భారత జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ .. అటు ప్రపంచ క్రికెట్లో కూడా అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక నేటితరం క్రికెటర్లలో రికార్డులు సాధించడం విషయంలో కూడా ఏ స్టార్ క్రికెటర్ కు అందనంత ఎత్తులో ఉన్నాడు. ఎంతో మంది దిగ్గజాలు సాధించిన రికార్డులను అలవోకగా బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. ఇక ప్రపంచ క్రికెట్లో తన పేరు మారుమోగిపోయేలా చేసుకున్నాడు అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇక నేటి తరానికి కోహ్లీ ఒక యుగ పురుషుడు లాంటి క్రికెటర్ అనడంలో సందేహం లేదు.



 అయితే ఇలాంటి విరాట్ కోహ్లీ మొన్నటికి ఏమన్నా మూడేళ్ల పాటు ఎంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.   దాదాపు మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. అయితే అతను అడప దడపా  పరుగులు చేస్తున్నప్పటికీ.. సెంచరీ చేయకపోవడంతో ఇక విరాట్ కోహ్లీ పై విమర్శలు కూడా వచ్చాయి. అయితే విరాట్ కోహ్లీ అప్పటి వరకు సాధించిన రికార్డులను టీమ్ ఇండియా కోసం చేసిన సేవలను మర్చిపోయిన ఎంతో మంది అతనిపై విమర్శలు చేయడం కూడా చూశాం. ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి బయటపడిన కోహ్లీ  మళ్ళీ ఇప్పుడు సెంచరీల మోత మోగిస్తున్నాడు.



 ఇకపోతే ఇదే విషయంపై ఇటీవలే భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫామ్ కోల్పోయిన సమయంలో విరాట్ కోహ్లీకి అదృష్టం కలిసి రాలేదు అంటూ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ప్రతి ఆటగాడి కెరియర్ లో బ్యాడ్ ఫామ్ సాధారణం. అదే కోహ్లీ విషయంలో కూడా జరిగింది. అతను ఆఫ్గనిస్తాన్ పై సెంచరీ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఆ టైంలో కొంచెం అదృష్టం కలిసి వచ్చింది. క్యాచ్ లు డ్రాప్ అవడం.. ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతులు వికెట్లను తాకకపోవడం లాంటి అదృష్టం కలిసొచ్చింది. కానీ ఫామ్ కోల్పోయినప్పుడు ఇలాంటి లక్ కలిసి రాలేదు అంటూ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: