ముఖ్యంగా ఇంగ్లాండ్ ఉమెన్ ప్లేయర్స్ అయితే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఎన్నో రికార్డులు కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలోని ఇంగ్లాండ్ బ్యాటర్ బ్యూమంట్ ఇటీవల ఒక అరుదైన ఘనత సాధించింది. ఏకంగా డబుల్ సెంచరీ తో చెలరేగిపోయింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ఇంగ్లాండ్ జట్టు తరఫున టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన మొదటి మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. ఇలా డబుల్ సెంచరీ చేసి ఇక ఇంగ్లాండ్ టీం కి ఒక గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో బ్యుమాంట్ కీలక పాత్ర వహించింది అని చెప్పాలి. అయితే బ్యుమాంట్ డబుల్ సెంచరీ నేపథ్యంలో టెస్ట్ ఫార్మాట్లో ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లీష్ ప్లేయర్ కూడా ఆమె కావడం గమనార్హం.
అదే సమయంలో సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో ఇప్పటివరకు మహిళల క్రికెట్లో ఎవరు డబుల్ సెంచరీ సాధించారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. కేవలం ఎనిమిది మంది ఉమెన్ ప్లేయర్స్ మాత్రమే టెస్ట్ ఫార్మాట్లో డబుల్ సెంచరీ సాధించారు. ఇందులో పాకిస్తాన్ ప్లేయర్ బాలుక్ 242 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉండగా.. ఆ తర్వాత భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 214 పరుగులతో రెండవ స్థానంలో ఉంది. ఇక పెర్రి 213, రోల్టోన్ 209, ఫ్లావెల్ 204, గోస్కో 204, బ్రాడ్ మెంట్ 200 పరుగు లతో ఈ లిస్టులో కొనసాగుతున్నారు. కాగా ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ బ్యూమంట్ 208 పరుగులు చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి