సిరి సెలెబ్రెటీలు క్రీడాకారులకు సంబంధించిన జీవితాల గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇలా సినీ సెలబ్రిటీలు క్రీడాకారులకు సంబంధించిన ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎప్పటికప్పుడు అటు అభిమానులకు సాధారణ ప్రేక్షకులకు కూడా తెలుస్తూనే ఉంటాయి. కానీ చాలామంది ఇలా ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలకంటే ఏకంగా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే అందరికీ తెలిసిన సెలబ్రిటీలు ఎవరితో అయినా రిలేషన్షిప్ లో కొనసాగుతున్నారా లేదా అనే విషయం పై కూడా సోషల్ మీడియాలో తెగ వెతికేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఎవరైనా ఇలాంటి విషయంపై మాట్లాడారు అంటే చాలు అది వార్తల్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.  కాగా భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇటీవల తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రణబీర్ అలవాడియా పాడ్ కాస్ట్ లో ఇటీవల పాల్గొంది షెట్లర్ పివి సింధు.


 ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఎప్పుడు అవ్వనంత ఓపెన్ అయిపోయింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను బయట పెట్టేసింది. ఈ క్రమంలోనే తన రిలేషన్షిప్ స్టేటస్ కూడా చెప్పింది. ఎవరితోనైనా డేటింగ్ చేశారా అని ప్రశ్న  అడిగితే.. అందుకు తాను సింగిల్గానే ఉన్నాను అంటూ బదులిచ్చింది. ఎందుకంటే తన తండ్రి కారణంగానే తనను ఎవరు బయటకు రమ్మని అడగలేరు. అయితే డేటింగ్ చేయడంలో తప్పేం లేదు. జీవితం సాగిపోతూ ఉంటుంది. ఒకవేళ ఆ టైం వస్తే అది కూడా జరుగుతుంది. ఇప్పటికైతే సింగిల్గానే ఉన్నా అంటూ చెప్పుకొచ్చింది పీవీ సింధు. కాగా పీవీ సింధు చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: