ఎన్నో రోజుల నుంచి తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న బిగ్బాస్ సీజన్ సెవెన్ చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందె. ఇక మరికొన్ని రోజుల్లో ఇక ఈ సీజన్ విజేత ఎవరు అన్న విషయంపై కూడా క్లారిటీ రాబోతుంది. అయితే ప్రస్తుతం ఉన్న ఓటింగ్స్ ప్రకారం రైతు బిడ్డగా కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది తెలుస్తుంది.


 ఎందుకంటే హౌస్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ తో పోల్చి చూస్తే పల్లవి ప్రశాంత్ కే ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది. ఇక రెండవ స్థానంలో శివాజీ మూడవ స్థానంలో అమర్దీప్ నాలుగవ స్థానంలో ఐదవ స్థానంలో ప్రియాంక ఉన్నారు.  అయితే ఇక ఈ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది అన్నది తెలుస్తుంది  అయితే ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న కారణంగా గతంలోనే ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న అర్జున్ ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా హౌస్ నుంచి బయటికి వెళ్ళబోతున్నట్లు సమాచారం.


 ఇక బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ ఏంటి అన్న విషయాన్ని గతంలోనే నాగార్జున చెప్పేశారు. ఒకవేళ పల్లవి ప్రశాంత్ గనుక విన్నర్ అయితే వచ్చిన అమౌంట్ రైతులకు ఇస్తానని ఇప్పటికే ప్రకటన చేశాడు. ఒకవేళ ఓటింగ్ పెరిగి శివాజీ విన్నర్ అయితే తనకు ఇష్టమైన యావర్, ప్రశాంత్ లకు డబ్బులు ఇవ్వబోతున్నట్లు చెప్పాడు. ఇక అమర్ ప్రియాంకలు ఎవరు గెలిచినా తమ కోసమే డబ్బులు వినియోగించుకుంటారు అని ఇప్పటికే చెప్పేసారు. అయితే పల్లవి ప్రశాంత్ శివాజీలలో ఎవరో ఒకరు విన్నర్ గా నిలుస్తారని తెలుస్తుంది. ఇక మిగతా కంటెస్టెంట్స్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి డబ్బులు ఆఫర్స్ చేస్తే తీసుకొని వెళ్ళిపోతారు అని అందరూ ఊహిస్తున్నారు. ఇలా ప్రైజ్ మనీ విన్నర్ కు మాత్రమే కాదు ఇక మధ్యలో డబ్బులు ఆఫర్ చేస్తే అది తీసుకొని వెళ్ళిపోయిన వారికి కూడా షేర్ అవుతుందని.. అలా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన వారికి ఇచ్చిన మొత్తాన్ని ప్రైజ్ మనీ లో కట్ చేస్తారు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl