గత కొంతకాలం నుంచి భారత జట్టును గాయాల బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ సమయంలో కూడా జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు గాయం బారిన పడి దూరం కావడంతో ఇక టీమిండియా వ్యూహాలు తారుమారు అవ్వడం కూడా జరిగింది. అయితే ఇక ఇప్పుడు వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా తో టి20 సిరీస్ ఆడిన టీమిండియా.. ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ఇక ఇప్పటికే ఈ టూర్ లో టి20 సిరీస్ ను ముగించుకుంది అని చెప్పాలి.


 అయితే మొదటిసారి దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్సు తో బరిలోకి దిగింది టీం ఇండియా. టి20 ఫార్మాట్ కు సూర్య కుమార్ యాదవ్, వన్డే ఫార్మాట్కు కేఎల్ రాహుల్, టెస్ట్ ఫార్మాట్ కు రోహిత్ శర్మ సారథ్యం వహించబోతున్నారు. కాగా నేటి నుంచి దక్షిణాఫ్రికా, ఇండియా టీమ్స్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈనెల 26వ తేదీ నుంచి సౌత్ ఆఫ్రికా తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడబోతుంది టీమిండియా. అయితే ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా కు బిగ్ షాక్ తగలబోతుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఇద్దరు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కాబోతున్నారు.


 ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్న మహమ్మద్ షమీ ఇక సౌతాఫ్రికా తో టెస్ట్ సిరీస్ నాటికి పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేడు అన్న విషయాన్ని ఇటీవల బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అతని ఫిట్నెస్ పై మెడికల్ టీం నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు అంటూ తెలిపింది. అయితే మరోవైపు ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా వన్డే సిరీస్ నుంచి దీపక్ చాహార్ దూరమయ్యాడు అని చెప్పాలి. అతను ఇక టీమ్ ఇండియాతో పాటు వెళ్లలేదు  అతని తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతో దగ్గరుండి తండ్రి బాగోగులు చూసుకుంటున్నాడు దీపక్ చాహార్. అతని స్థానంలో ఆకాష్ దీప్ ను ఎంపిక చేసింది బీసీసీఐ.

మరింత సమాచారం తెలుసుకోండి: