ప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక ఈ కుర్రాళ్ల వరల్డ్ కప్ లో భాగంగా ఎంతో మంది ఆటగాళ్ళు అద్భుతమైన ఆట తీరుతో వార్తల్లో హాట్ కాపీక్ గా మారి పోతున్నారు. ఇక వీరోచితమైన పోరాటం చేస్తూ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు చెప్పాలి.


 కాగా ఈ అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో డిపెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన టీమిండియా జట్టు అదర గొట్టేస్తుంది. వరుస విజయాలు సాధిస్తూ దూసుకు పోతుంది అని చెప్పాలి. అది కూడా ఏకంగా ప్రత్యర్థి పై రెండు వందల పరుగుల తేడాతో విజయం సాధించి ఇక పూర్తి ఆధిపత్యాన్ని చలాయిస్తుంది భారత జట్టు. ఈ క్రమంలోనే ఇటీవలే మరో సారి ఇలాంటి ఒక గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది అని చెప్పాలి.అయితే ఇటీవల జరిగిన మ్యాచ్లో ఘన విజయం తో ఏకంగా సెమీఫైనల్ లో కూడా అడుగు పెట్టింది యంగ్ టీమిండియా.


 అయితే ఇప్పటికే అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా ఆడిన నాలుగు మ్యాచ్లలో కూడా మూడింట భారీ విజయాలు సాధించి.. ఇంక పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇక ఇటీవల నేపాల్ తో జరిగిన మ్యాచ్లో కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా లో సచిన్ దాస్ 116, ఉదయ్ 100 సెంచరీలతో చెలరేగిపోయారు. 50 ఓవర్లలో 297 పరుగులు చేసింది టీమిండియా. ఇక లక్ష్య చేదనకు దిగిన నేపాల్ 50 ఓవర్లలో 165 పరుగులకు పరిమితమైంది. దీంతో టీమ్ ఇండియా 132 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుని సెమీ ఫైనల్ లో అడుగు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: