ప్రస్తుతం టీమిండియా తరఫున ఆడుతున్న తెలుగు క్రికెటర్ ఎవరు అంటే హైదరాబాద్ బౌలర్ అయిన మహమ్మద్ సిరాజ్ మాత్రమే అని చెప్పాలి. ఇక ఇలా తెలుగు ప్రజల తరఫున మహమ్మద్ సిరాజ్ టీం ఇండియాకు వరల్డ్ కప్ జట్టు కోసం ఎంపిక అవుతాడని అద్భుతంగా రానించి.. భారత జట్టు వరల్డ్ కప్ గెలవడం లో కీలక పాత్ర వహిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో సిరాజ్ చెత్త ప్రదర్శనలు చేస్తున్నాడు  ప్రస్తుతం ఐపిఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న సిరాజ్.. తన బౌలింగ్ తో అందరికీ చిరాకు తెప్పిచ్చేస్తున్నాడు.


 ఇక రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్న సిరాజ్.. అటు పరుగులు కట్టడి చేసి  జట్టు విజయం లో కీలకపాత్ర వహించాల్సింది పోయి.. ప్రతి మ్యాచ్ లోను భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఇక వికెట్లు తీసింది కూడా తక్కువే.  దీంతో అతని బౌలింగ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే ఇక సిరాజ్ ను పక్కనపెట్టి మరొకరికి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.


 ఇదే విషయంపై టీమ్ ఇండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సిబి స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కు కనీసం రెండు మ్యాచ్ల కైనా విశ్రాంతి ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు హర్భజన్ సింగ్. సిరాజ్ గత ఏడాది అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అతడు ఒక ఛాంపియన్ బౌలర్ కానీ ఈ ఐపీఎల్లో ఎందుకో తేలిపోతున్నాడు. అతడు అలసిపోయినట్లు కనిపిస్తుంది. సిరాజ్ శారీరకంగా మానసికంగా ఫిట్టుగా లేడు అని అనిపిస్తుంది  అతడి కోసం కొంచెం సమయం ఇచ్చి కనీసం రెండు మ్యాచ్లలో అయిన విశ్రాంతి ఇస్తే.. మళ్లీ సూపర్ కం బ్యాక్ ఇస్తాడు అంటూ హార్భజన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: