ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఐపీఎల్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగా క్రికెట్లో గెలుపు ఓటములు సహజం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో కొత్తగా ఏముండదు. ఒక జట్టు గెలవాలంటే.. మరో జట్టు ఓడిపోవాల్సిందే. అయితే ఇటీవల సన్రైజర్స్ జట్టు గెలిస్తే లక్నో జట్టు ఓడిపోయింది. కాకపోతే లక్నో టీం 20 ఓవర్లలో ఎంతో కష్టపడి చేసిన స్కోర్ ని సన్రైజర్స్ ఓపెనర్లు తొమ్మిది ఓవర్లలోనే చేదించేసారు.


 ఇది అభిమానులు అందరినీ కూడా కాస్త నిరాశపరిచింది అని చెప్పాలి. అయితే ఇలా లక్నో జట్టు సన్రైజర్స్ చేతిలో ఘోర ఓటమి తర్వాత సంజీవ్ గోయంక  ఆ జట్టు కెప్టెన్ కే ఎల్ రాహుల్ పై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా కెమెరాల ముందే రాహుల్ పై తిట్ల దండకం అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఏకంగా జట్టు కెప్టెన్ పట్ల సంజీవ్ గోయంక ఇలా వ్యవహరించడం ముమ్మాటికీ తప్పే అంటూ అటు ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.


 అయితే మరోవైపు గతంలో ధోని పరిస్థితి ఇప్పుడు కేఎల్ రాహుల్ కి రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే గతంలో చెన్నై పై నిషేధం కొనసాగిన సమయంలో ఇక పూనే వారియర్స్ జట్టుకి కెప్టెన్గా వ్యవహరించాడు ధోని. ఇక పూనే వారియర్స్ కి కూడా ఓనర్ గా ఉన్న సంజీవ్ గోయంక  ఇక ధోనీనే కెప్టెన్సీ నుంచి తప్పించారు. యువ కెప్టెన్ అవసరం అనుకున్నాము. అందుకే ఇలా ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం అంటూ అప్పట్లో గోయాంక సమాధానం ఇచ్చారు. ఇప్పుడు కేఎల్ రాహుల్ కి కూడా ఇదే పరిస్థితి రావచ్చు అంటూ ఎంతోమంది క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: