కట్ చేస్తే, విరాట్ కోహ్లీ కేవలం 594 ఇన్నింగ్స్ లలో 27000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దాంతో ప్రపంచంలోనే 600 కంటే తక్కువ ఇన్నింగ్స్ లో ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్ మెన్‌గా నిలిచాడు. అంతేకాదండోయ్... ఈ ఘనత సాధించిన ప్రపంచంలో 4వ బ్యాటర్ కూడా కోహ్లీ కావడం గమనార్హం. సచిన్, విరాట్ తర్వాత శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 27000+ పరుగులు సాధించారనే విషయం మీకు తెలిసే ఉంటుంది.
ఇకపోతే, గెలుపే లక్ష్యంగా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రోహిత్ శర్మ (23), యశస్వి జైస్వాల్ రూపంలో అద్భుతమైన ఆటతీరుని కనబరిచారు. ఫలితంగా 18 బంతుల్లో ఏకంగా 50 పరుగులు సాధించారు. ఆ తర్వాత గిల్, జైస్వాల్‌లు కేవలం 10.1 ఓవర్లలోనే జట్టు స్కోరును 100 దాటించారు. 150 పరుగులు పూర్తి చేసేందుకు టీమిండియా 18.2 ఓవర్లు మాత్రమే పట్టడం విశేషం. కాగా, శుభ్‌మన్ గిల్ 39 పరుగులతో ఔట్ కాగా, జైస్వాల్ 51 బంతుల్లో 2 సిక్సర్లు, 12 ఫోర్లతో 72 పరుగులు చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కూడా దూకుడుగా బ్యాటింగ్ కొనసాగించారు.