
అయితే, ఈ విజయం వెనుక సిరాజ్ ఎన్నో బాధలు దాగి ఉన్నాయి. రీసెంట్‌గా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఇండియా టీమ్‌ను సెలెక్ట్ చేసినప్పుడు సిరాజ్‌కు చోటు దక్కలేదు. దీంతో సిరాజ్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. నిన్నటి వరకు ఇండియా వన్డే టీమ్‌లో రెగ్యులర్‌గా ఆడిన సిరాజ్‌ను ఈ మెగా టోర్నీకి పక్కన పెట్టడం అతడిని తీవ్రంగా కలిచివేసింది. స్పిన్ బౌలింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ సెలెక్టర్లు టీమ్‌ను ఎంపిక చేశారు. దాంతో మెయిన్ ఫాస్ట్ బౌలర్లుగా షమీ, హర్షిత్ రాణాకు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. వాళ్లలో షమీ ఒక్కడే అన్ని మ్యాచ్‌లు ఆడగా, హర్షిత్ రాణాకు కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే అవకాశం దక్కింది.
మ్యాచ్ తర్వాత సిరాజ్ తన బాధను బయటపెట్టాడు. "ఛాంపియన్స్ ట్రోఫీకి నన్ను సెలెక్ట్ చేయకపోవడం నిజంగా చాలా కష్టంగా అనిపించింది. దాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోయాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో సిరాజ్ ఎమోషనల్‌గా మాట్లాడాడు. "కానీ, మళ్లీ నా సొంత గ్రౌండ్‌కు రావడం, ఫ్యామిలీ మెంబర్స్‌ను క్రౌడ్‌లో చూడటం నాకు మనసుకి బలాన్నిచ్చింది" అని అన్నాడు.
తన ఎమోషన్స్‌ను ఎలా కంట్రోల్ చేసుకున్నాడో, నిరాశను మోటివేషన్‌గా ఎలా మార్చుకున్నాడో కూడా సిరాజ్ చెప్పాడు. "నేను నా బౌలింగ్‌పై, మైండ్‌సెట్‌పై చాలా కష్టపడ్డాను. ఫిట్‌నెస్‌ను ఇంప్రూవ్ చేసుకోవడంపై ఫోకస్ చేశాను. ఇండియా కోసం రెగ్యులర్‌గా ఆడుతున్నప్పుడు సడన్‌గా తప్పించడంతో డౌట్స్ రావడం సహజం. ఇంకా నేను అంత మంచి ప్లేయర్‌నేనా అని నాకే అనిపించింది" అని సిరాజ్ తనలోని బాధను వెల్లడించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఏడేళ్ల అనుబంధం తర్వాత ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న సిరాజ్ ఐపీఎల్ 2025లో మాత్రం అదరగొడుతున్నాడు. కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే 13.77 యావరేజ్‌తో, 7.75 ఎకానమీతో 9 వికెట్లు పడగొట్టాడు.
"నేను ఐపీఎల్ కోసం ఎదురుచూశాను. నా మిస్టేక్స్‌ను ఫిక్స్ చేసుకున్నాను. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ నా ప్లాన్స్ వర్కవుట్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఫీలవుతాను" అని సిరాజ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.