
దర్యాప్తు పూర్తి అయ్యేవరకు హైదర్ అలీ ను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లుగా ప్రకటించారు.. యూకే చట్టాలకు పూర్తిగా తమ సహకరిస్తామంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలియజేసింది. అలాగే హైదర్ అలీ కి న్యాయ సహాయం కూడా అందిస్తామంటూ పిసిబి వెల్లడించింది. దర్యాప్తులో అన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాతే పాకిస్తాన్ బోర్డు అతని పైన పలు రకాల చర్యలు తీసుకుంటుంది అంటూ కూడా తెలియజేశారు.
జులై 23వ తేదీన మాంచెస్టర్లోని ఒక ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లుగా అక్కడ అధికారులు తెలియజేశారు.. 24 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశామని దర్యాప్తు తర్వాత ఆ వ్యక్తిని బెయిల్ పై విడుదల చేశామంటూ అక్కడ పోలీసులు తెలియజేశారు. ఇంగ్లాండ్ చట్టాల ప్రకారం ఈ దశలో నిందితుల పేర్లను పోలీసులు సైతం అధికారికంగా వెల్లడించలేదు. కానీ అధికార వర్గాల నుంచి మాత్రం ఈ సమాచారం బయటపడినట్లుగా తెలుస్తోంది. బాధితురాలు ప్రవాస పాకిస్తాన్ యువతి అన్నట్లుగా తెలుస్తోంది. హైదర్ అలీ 2020లో పాకిస్తాన్ తరుపున అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చారు.. ఇప్పటివరకు 35 టి 20 లు, రెండు వన్డేలు ఆడారు. 2021లో ఈ క్రికెటర్ సస్పెండ్ కూడా అయ్యారు.