ఏదైనా అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది అంటే జట్టు ఆటగాళ్లు అందరూ ఎంతో క్రమ శిక్షణగా మెలగాల్సి వస్తుంది. పలానా రోజు మ్యాచ్ ఉంది అంటే ఏ సమయానికి ఆటగాళ్లు మైదానంలో ఉండాలి. ఏ సమయం వరకు ఎలాంటి పనులు చేయాలి అనేది పక్కగా ఐసీసీ చెప్పిన ప్రకారం ఆటగాళ్లు , జట్టు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం ఆసియా కప్ టోర్నమెంట్ జరుగుతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఏ గ్రూపులో నాలుగు జట్లు , బి గ్రూప్లో నాలుగు జట్లు ఉన్నాయి. ఇండియా , పాకిస్తాన్ జట్లు ఏ గ్రూపులో ఉన్నాయి.

ఇకపోతే పోయిన ఆదివారం ఇండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... పెహల్గాం దాడి తర్వాత ఇండియా , పాకిస్తాన్ మధ్య జరిగిన మొదటి క్రికెట్ మ్యాచ్ ఇదే. ఇక ఇండియా , పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ కోసం టాస్ వేసిన సందర్భంలో టాస్ అనంతరం ఇరు జట్ల కెప్టెన్స్ షేక్ అండ్ ఇచ్చుకోలేదు. ఆ తర్వాత ఇండియా మ్యాచ్ గెలిచింది.

ఆ మ్యాచ్ అనంతరం కూడా ఇరి జట్ల ఆటగాళ్లు షేక్ అండ్ ఇచ్చుకోలేదు. దానితో పాకిస్తాన్ జట్టు మేము షేక్ అండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కానీ ఇండియా జట్టు ఆటగాళ్లు మాకు షేక్ అండ్ ఇవ్వలేదు. అది మాకు అవమానంగా ఉంది అనే వార్తలు బయటకు వచ్చాయి. ఇకపోతే నిన్న పాకిస్తాన్ , యూఏఈ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ స్టార్ట్ కావడం కంటే ముందు అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇండియా ఆటగాళ్లు తమకు షేక్ అండ్ ఇవ్వలేదు అని , అది అవమానంగా ఉండడంతో తాము ఆసియా కప్ నుండి వైదొలుగుతాం అనే ఉద్దేశాన్ని వారు వెల్లబుచ్చినట్లు తెలుస్తోంది. కానీ చివరకు పాక్ జట్టు దిగివచ్చింది. కానీ ఈ మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: