భారతదేశం పాకిస్తాన్ మధ్య ఎప్పుడూ ఏదో ఒక పోరు ఉంటూనే ఉంటుంది.  భారత్ పాకిస్తాన్ మధ్య ఏదైనా క్రికెట్ మ్యాచ్ జరిగితే చాలు ఆరోజు టీవీ లకు రేటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జనాలంతా టీవీల ముందు కూర్చుని మ్యాచ్ తిలకిస్తారు.. తాజాగా జరిగిన ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఆసియా కప్ 2025 టోర్నీలో కూడా పాకిస్తాన్ జట్టును ఫైనల్ తో సహా ఇప్పటికే మూడుసార్లు చిత్తు చేసిన టీమిండియా విజేతగా నిలిచింది. ఓటమి లేని జట్టుగా పేరు తెచ్చుకుంది. 41 సంవత్సరాల ఆసియా కప్ టోర్నీ చరిత్రలో  మొదటిసారి భారత్ పాకిస్తాన్ ఫైనల్లో తలపడి సూర్యసేన విజయం సాధించింది.


ఈ విజయంతో తొమ్మిది సార్లు ఆసియా కప్ టోర్నీలో ఛాంపియన్ గా నిలిచిన  జట్టుగా భారత్ రికార్డుకెక్కింది. ఏడుసార్లు జరిగినటువంటి వన్డే టోర్నీలో గెలిచిన టీమిండియా రెండుసార్లు టి20 టైటిళ్లను అందుకుంది. రెండు వారాల వ్యవధిలోనే పాకిస్తాన్ ను మూడుసార్లు ఓడించినటువంటి భారత్  మరోసారి తలపడేందుకు సిద్ధమైంది. మరో నాలుగు రోజుల్లో ఈ మ్యాచ్ జరగబోతోంది. అయితే ఇది పురుషుల మ్యాచ్ కాదు మహిళల మ్యాచ్. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై  గెలిచేందుకు భారత మహిళా టీం కసరత్తులు  చేస్తోంది. అక్టోబర్ 5న ఆదివారం రోజు కొలంబో వేదికగా  మధ్యాహ్నం మూడు గంటలకు ప్రేమదాస్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవ్వబోతోంది. 

ఈ మెగా టోర్నీకి ఇండియాతో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇండియాలో పర్యటించేందుకు పాకిస్తాన్ సుముఖంగా లేకపోవడంతో  రెండు దేశాల క్రికెట్ బోర్డులు ఒప్పందం చేసుకొని  తటస్థ వేదికగా మ్యాచులు జరగబోతున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ టీం సెమీఫైనల్ మరియు ఫైనల్ చేరితే ఈ యొక్క మ్యాచ్ లు కూడా శ్రీలంక వేదికగానే జరుగుతాయి. ఇందులో భాగంగానే విశాఖలో 9న సౌత్ ఆఫ్రికాతో, 12న ఆస్ట్రేలియాతో ఆడనుంది. అలాగే ఇండోర్ లో 19న ఇంగ్లాండుతో, అక్టోబర్ 23న న్యూజిలాండ్, అక్టోబర్ 26న బంగ్లాదేశ్ తో భారత్ జట్టు తలబడనుంది. అక్టోబర్ 29, 30న సెమీఫైనల్స్ జరగబోతుండగా నవంబర్ 2న జరిగే ఫైనల్ తో టోర్నీ ముగిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: