ఇక తన ప్రత్యర్థి కంపెనీల నుంచి పోటీని ఎదుర్కోవడంలో వాట్సాప్‌ ఎల్లప్పుడూ కూడా ముందుంటుందనే చెప్పాలి. ఇందులో భాగంగానే కొత్త ఫీచర్లను (Features) పరిచయం చేస్తూ తన యూజర్లను వాట్సాప్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఇక రకరకాల మెసేజింగ్‌ యాప్స్‌ (Apps) అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో యూజర్లను చేజారిపోకుండా వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కూడా కొత్త కొత్త ఆప్షన్స్‌ను పరిచయం చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా మరో రెండు కొత్త ఫీచర్లను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్‌. ఈ ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలను వాట్సాప్‌ బీటా ఇన్ఫోలో సూచనప్రాయంగా తెలిపడం జరిగింది. వాట్సాప్‌ తీసుకురానున్న ఆ సరికొత్త ఫీచర్లు ఇవే..



లాంగ్వేజ్‌ ఫీచర్‌..వాట్సాప్‌ ఇప్పటి దాకా కేవలం ఇంగ్లిష్‌ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే తాజాగా ఇతర భాషల్లోకి కూడా అందబాటులోకి తేనున్నట్లు సమాచారం తెలుస్తోంది. యూజర్లకు సెట్టింగ్స్‌లోకి తమకు నచ్చిన భాషను సెలక్ట్‌ చేసుకునే ఛాన్స్ ని కల్పించనున్నట్లు సమాచారం. అయితే వాట్సాప్‌ ఈ ఆప్షన్స్‌ను ఏయే భాషలలో అందిస్తుందన్న విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మొదట ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌ 2.22.9.13 వెర్షన్‌ వాడే వారికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ పలు ప్రయాత్నాలు చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఇక త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ అనేది రానుంది.అలాగే వాట్సాప్‌ గ్రూప్స్‌లో పోల్‌ ఆప్షన్‌ ఉంటుంది..ఇక వాట్సాప్‌ గ్రూప్‌లో ఏదైనా ఒక విషయంపై పోలింగ్ నిర్వహించి ఇతరుల అభిప్రాయాలను తెలుసుకునే పోల్స్‌ ఫీచర్‌పై వాట్సాప్‌ గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.



అయితే తాజాగా ఈ ఫీచర్‌ టెస్టింగ్ చివరి దశకు చేరకున్నట్లు సమాచారం తెలుస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్‌ను మనకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక ఇందులో భాగంగా పోల్ రూపొందించడానికి ముందు ఒక ప్రశ్నకు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. యూజర్లు ఓటు వేయడానికి మల్టీపుల్ ఆప్షన్స్‌ అనేవి ఇవ్వాలి. ఇక పోల్ ముగిసిన తర్వాత ఫలితాలు అనేవి వెలువడుతాయి. అయితే గ్రూప్‌ అడ్మిన్‌లు పోల్‌ ఆప్షన్స్‌ను మార్చగలరా.? ఇంకా పోలింగ్‌కు టైం లిమిట్‌ అనేది ఉంటుందా.? అన్న వివరాలపై ఇంకా స్పష్టత అనేది రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: