సోమవారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా అవినాష్ తొలుత మోనాల్ ని నామినేట్ చేయగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది...అన్నింటినీ పాజిటివ్ గా తీసుకునే అవినాష్ సైతం ఇక్కడ ఆగ్రహంతో ఊగిపోవడం విశేషం. నేనెప్పుడూ అందరితో సరదాగా ఉంటూ ఎదుటివారిని నవ్వించడానికి ప్రయత్నిస్తాను. కానీ దాంట్లో కూడా మీరు తప్పులు వెతికితే అది మీ ప్రాబ్లం అంటూ మోనాల్ పై విరుచుకుపడ్డాడు అవినాష్...