జబర్దస్త్ లో లవ్ జంటగా పేరు సంపాదించుకున్న జంట ఇమ్యానుయేల్, వర్ష.. ఈ షో ద్వారా ఎంతో లైఫ్ సెటిల్ అవడంతో పాటు లైఫ్ పార్టనర్ లు కూడా సెటిల్ అవుతున్నట్లు ప్రస్తుతం పరిస్థితి ని బట్టి తెలుస్తుంది. ఇప్పటికే ఈ షో ద్వారా సుధీర్, రష్మీ ఎవర్ గ్రీన్ జంటగా నిలిచిపోయారు. వారు పెళ్లి చేసుకుంటారో లేదో తెలీదు కానీ టీవీ షోల్లో వారు ఇచ్చే బిల్డప్ మాత్రం అలాగే ఉంటుంది.. ప్రతి ఎపిసోడ్ లో వీఎరిన్ హైలైట్ చేయడానికి చూస్తుంటారు నిర్వాహకులు.. ఓ వైపు సోషల్ మీడియా లో వీరి మధ్య ఏదీ లేదని చెప్తూనే మరోవైపు టీవీ షో లో ఎదో ఉందన్నట్లు చూపిస్తున్నారు..