ఈరోజు బిగ్ బాస్ ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే అంశంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎక్కువమంది ఇంటి సభ్యులు అంతా కూడా ఖచ్చితంగా కుమార్ సాయి బయటకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఒక వర్గం వారు కుమార్ సాయి ఎలిమినేట్ అవ్వడం కన్ఫర్మ్ అని చెప్తున్నారు... అయితే మరికొందరు మాత్రం ఈసారి మెహబూబ్ ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మరో బిగ్ బాస్ న్యూస్ లీక్ సంచలనం సృష్టిస్తోంది.... వీరిద్దరు కంటే కాస్త బలమైన కంటెస్టెంట్ అయిన... టీవీ9 యాంకర్ దేవి హౌస్ నుండి ఈ వారం బయటకు వెళ్లి పోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది. మిగిలిన ఇంటి సభ్యులతో పోలిస్తే.... దేవి కాస్త రూడ్ గా ఉంటుంది అంటూ ప్రేక్షకుల అభిప్రాయం అని తెలుస్తోంది... అందుకే ఓట్లు కూడా చాలా తక్కువ వచ్చాయని సమాచారం.మరి బిగ్ బాస్ హౌస్ లో ఉండేది ఎవరు...? వెళ్ళేది ఎవరు....? తెలుసుకోవడానికి మరి కొన్ని గంటలు వేచిచూడాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి