జబర్దస్త్ షో ద్వారా బాగా పేరు సంపాదించాడు మహేష్ ఆచంట.. అయితే ఆ తర్వాత షో ని వదిలి వెళ్ళడం..ఆ తరువాత ఎన్నో సినిమాలలో అవకాశం వచ్చి నటించి, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు సినిమాలలో. ఇక అంతే కాకుండా ఆయన గురించి కొన్ని విషయాలను తానే స్వయంగా ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు.

మహేష్ 2011లో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారట, అంతేకాకుండా మరో పక్క జాబ్ చేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ వచ్చారట. 2013 సినిమాల వైపే వెళ్లాలని డిసైడ్ అయ్యాడట.
తను మొదటి సారిగా దగ్గుపాటి రానా నటించిన "నా ఇష్టం" సినిమాలోని ఒక పాటలో కనిపిస్తానని వెల్లడించారు.తను మొదటి సారి సినిమాలలో నటించడానికి చాలా స్టూడియోలు, సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాడట. ఇక సినిమాలలో నటించడానికి చాలా కష్టపడ్డాను అని చెప్పాడు. ఇప్పుడైతే "టిక్ టాక్", యూట్యూబ్ ఛానల్ వంటివి ఉన్నాయి అని తెలిపాడు.


 ఒకసారి డైరెక్టర్ మారుతి దగ్గర.. నేను క్రేన్ డిపార్ట్మెంట్ కి వెళ్లాను. అక్కడ సప్తగిరి అన్న, ప్రవీణ్ అన్న కూడా వచ్చారు, దాంతో వారిద్దరూ నాతో బాగా కలిసిపోయారు అని చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత ప్రతి రోజు పండుగ సినిమాలు నాకు అవకాశం కల్పించారు అని తెలిపారు. నాకు సినీ ఇండస్ట్రీ లో బాగా సపోర్ట్ చేసింది సుకుమార్ గారే అని చెప్పుకొచ్చాడు.సుకుమార్ గారికి నా మీద ఉన్న నమ్మకంతో రంగస్థలం సినిమా లో అంత మంచి పాత్రలు నాకు ఇచ్చాడని చెప్పుకొచ్చాడు.

కానీ ఆయన కుమారి 21 ఫ్, ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమ సినిమా లో ఏదైనా ఒక పాత్ర ఇచ్చి ఉంటే బాగుండు అనిపించింది. కానీ ఈ సినిమాలో నాకు ఎటువంటి క్యారెక్టర్ ఇవ్వలేదు.అది  ఎందుకో అర్థం కాలేదు. రంగస్థలం సినిమా విడుదల అయిన తరువాత.. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, సుకుమార్ గారి తో ఇలా అన్నారట. అబ్బాయిని ఒకసారి భోజనానికి తీసుకురండి సుకుమార్ అని తెలిపారట.నాకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు.

"నేను నా నాగార్జున"అనే సినిమాలో  హీరోగా చేశాను, ఇక అంతే కాకుండా"బట్టల రామస్వామి " బయోపిక్ లో కూడా నేనే నటించాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల చేత చేయలేకపోయాను.ఇక ప్రస్తుతం పాగల్ సినిమాలో నటిస్తున్నాను.ఈ సినిమా డైరెక్టర్ నరేష్ నాకు ఒక మంచి మిత్రుడు అని తెలిపాడు.

అయితే ఇప్పటివరకు మనకు తెలియని కొన్ని విషయాలను తనే స్వయంగా తెలియజేశాడు మహేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: