తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎండ్ కార్డ్ వేసుకునేందుకు ముస్తాబవుతోంది. చివరి దశలో ఆటను మరింత రసవత్తరంగా మారుస్తున్నారు బిగ్ బాస్. అబ్బబ్బ ఆ టాస్క్ లు, నామినేషన్ ప్రాసెస్ లు ఇలా ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా ఉంటున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బిగ్ బాస్ హౌజ్ లో జంట పాముల పర్ఫార్మెన్స్ మరో ఎత్తు. వీరి రిలేషన్ ఎంత స్ట్రాంగ్ గా ముడిపడింది అంటే జనాలకి చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు అసలు ఏంటిది బిగ్ బాస్....అంటున్నారు. ఇక అనకేం చేస్తారు లేండి. సమయం, సందర్భం పాడు లేకుండా ఏదో వీరిద్దరూ రెండు అయస్కాంత ముక్కల్లా ఊరకనే అలా అతుక్కుపోయి హగ్ ల మీద హగ్ లు ఇచ్చుకుంటూ పోతుంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి టివి ముందు నుండి మాకేంటి కర్మ అంటూ పరుగులు తీస్తున్నారు.

ఇటు సోషల్ మీడియాలోనూ వీరిపై ఘాటు వార్తలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. నెటిజన్లు అయితే వీరిపై ఓ రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు. పాపం బిగ్ బాస్ హౌజ్ లో సిరికి బెడ్ ఇచ్చినట్లు లేరు, అందుకే  అర్దరాత్రి అపరాత్రి అని లేకుండా ఎప్పుడు చూసినా షణ్ముఖ్ బెడ్ పై పడుకొని దొర్లుతూ ఉంటుంది. అంతే కాదు వీరికి ఎమోషన్స్ వస్తే..మిగిలిన ఇంటి సభ్యులు అసలు కంటికి కనబడరు. హౌస్ మొత్తంలో వీరిద్దరే ఉన్నట్టు ఒకరి నొకరు హగ్ చేసుకుని వాళ్ళ ఎమోషన్స్ ను చూపిస్తుంటారు. అసలు వీళ్ళ వ్యవహారం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.

అప్పుడప్పుడు షణ్ముఖ్ సిరిని కాస్త దూరం పెడుతున్నప్పటికీ సిరి మాత్రం కనెక్షన్ ఎఫెక్షన్ అంటూ గీత దాటుతోంది. మొత్తానికి ఈ ఇద్దరి రొమాన్స్ బిగ్ బాస్ ఆడియన్స్ కి ఇబ్బందిగా మారుతోంది. అసలు కెమెరాలు ఉన్న సంగతి కూడా మరిచిపోతున్నారో ఏమో కానీ వీరిది హైలెట్ అవ్వడం కోసం యాక్టింగా లేక నిజమా అన్నది మాత్రం అర్థం కావడం లేదు. మరి ఇంకో కొద్ది రోజుల్లో బయటకు వచ్చాక పబ్లిక్ లో వీరి గురించి ఏమనుకుంటున్నారో అర్థంవవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: