బిగ్ సీజన్ ఫైవ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు ఓ లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా పర్ఫామెన్స్ ఇస్తున్నారు ఇంటి సభ్యులు. ఇంకో మూడు వారాల్లో సీజన్ ఫైవ్ కి ముగింపు కార్డ్ పడనున్న నేపథ్యంలో ఓ లేటెస్ట్ అప్డేట్ బిగ్ బాస్ ప్రేక్షకులను తెగ ఊరిస్తోంది. ఈ చల్లటి సమయంలో ఈ వార్త హాట్ హాట్ గా వినిపిస్తోంది. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా...సీజన్ ఫైవ్ ఫినాలే ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీజన్ 1,2,3,4 హౌస్ మేట్స్ అంతా కలిసి సందడి చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్లానింగ్ వారి వారి డేట్స్ అన్ని సమకూరుస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఇద్దరు, ముగ్గురు తప్ప మిగిలిన అన్ని సీజన్ల కంటెస్టెంట్స్  అందరూ సీజన్ ఫైవ్ ఫినాలే స్టేజ్ పై హంగామా చేయనున్నారని తెలుస్తోంది. ఇంకేముంది ఫినాలే రచ్చ మామూలుగా ఉండదు మరి..!! చూసే వారికి ఆ కిక్కే వేరప్ప..!! ఇక ఈ షో అంతటికీ హ్యాండ్సమ్ హీరో నవదీప్,  మన లౌడ్ స్పీకర్ శ్రీముఖి , క్రేజీ యాంకర్ రవి యాంకరింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. స్టేజ్ పై నవదీప్ ఉన్నాడు అంటే  దీపావళి టపాసుల్లా పంచులు ఫటా ఫట్ పేలుస్తాడు. ఇక శ్రీముఖి గురించి వేరే చెప్పనక్కర్లేదు మైకు లేకుండానే 100 స్పీకర్లు ఒకే దగ్గర పెట్టినట్లు మాట్లాడుతూ అలరిస్తుంది. మరి రవి ఏమైనా తక్కువా...ఎక్కడున్నా తన గ్రేస్ చూపుతాడు ఈ యంగ్ యాంకర్.

అలాగే ఈ ప్రోగ్రామ్ లో ప్రతి సీజన్ 1 కంటెస్టెంట్స్  ఒక గ్రూప్ గా అలాగే 2,3,4 లు కూడా ఒక్కో గ్రూప్ గా విడిపోయి వరుస సాంగ్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారట. ఆహా వింటుంటేనే ఆ దృశ్యం కనులముందు కదలాడుతూ జోష్ పెంచుతోంది. ఇక నిజంగానే వీరంతా ఒకే స్టేజ్ పై కనపడి సందడి మొదలెడితే వేరే లెవల్...అంతే. ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: