ఒకప్పుడు అయితే ఎవరు ఏ పని చేసినా అది ఏదో ఒక విధంగా బయటకు రావడానికి చాలా కాలం పట్టేది. కానీ నేడు సోషల్ మీడియా వ్యాప్తి ఎక్కువ కావడంతో ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో వైరల్ అవుతోంది. అంతే కాకుండా సోషల్ మీడియా ద్వారా ఎందరో ప్రతిభ ఉన్న వారు సెలబ్రిటీలు గా మారిపోతున్నారు. రంగం ఏదైనా ప్రేక్షకులను ఆకట్టుకుంటే చాలు రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోతున్నారు. అలా సెలబ్రిటీగా మారిన వారిలో ప్రముఖ టీవీ న్యూస్ రీడర్ మరియు యాంకర్ దేవీ నాగవల్లి ఒకరు. అంశం ఏదైనా తన సైనా స్టైల్ లో ప్రజల ముందుకు తీసుకు వెళ్ళడం లో తనకు తానే సాటి అని చెప్పాలి. ఈమెకు టీవీ9 ద్వారా వచ్చిన పాపులారిటీ తో మా టీవీ లో వచ్చిన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ తన వ్యక్తిత్వానికి సూట్ కాకపోవడంతో త్వరగానే బయటకు వచ్చేసింది. 

అప్పటి నుండి ప్రేక్షకులకు ఈమె గురించి అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఈమెకు జర్నలిజం అంటే ఎంత ఇష్టం అంటే, కెరీర్ కోసం ఈ మహిళ ఈ పని చేసింది అంటే ఎవరైనా నమ్మగలరా? నిజం అండి జర్నలిజంలో ముందుకు దూసుకు వెళ్ళడానికి తన భర్తను సైతం వదిలేసినట్లు రీసెంటుగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పిందట. అయితే దానికి ఎలాంటి విషయం కారణం అయింది అనేది ఇప్పుడు చూద్దాం.  ఈమె జర్నలిస్ట్ గా ఎదుగుతున్న రోజులలోనే ఇంట్లో వారు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారట. కానీ తనకు ఇష్టం లేదని ఎంత చెబుతున్నా వినకుండా అమెరికా సంబంధం మరియు బాగా సెటిల్ అవుతావు అని అందరూ ఒప్పించి పెళ్లి చేశారట. ఇష్టం లేకుండానే పెళ్లి సంసారం ఒక బిడ్డ అన్నీ జరిగిపోయాయి.

కానీ దేవి నాగవల్లి మనసంతా జర్నలిజం మీదనే ఉంది. అందుకే ఒక రోజు దైర్యం చేసి భర్తకు చెప్పేసిందట. నాకు మీతో కలిసి ఉండడం ఇష్టం లేదని చెప్పిందట. అయితే నా నిర్ణయాన్ని కొన్ని రోజులు ఆలస్యం అయినా ఒప్పుకున్నారు అట. అలా ఇద్దరికీ 6 నెలల్లో విడాకులు మంజూరు అయ్యాయి. అయితే విడిపోయిన సందర్భంలో తన భర్త వలన ఎటువంటి సమస్య లేదని చెప్పింది. అంటే కాకుండా తన భర్త గురించి చెబుతూ ఆయన చాలా మంచోడు అని చెప్పడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు. అదేంటి భర్త మంచోడు అయినా విడిపోయిందా? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: