ఇక ఈ ఎపిసోడ్ లో ఆషు రెడ్డి కాస్త ఓవర్ ఆక్షన్ చేసినట్టుగా ఉందంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. తాజాగా అందుకు సంబంధించి ప్రోమో కూడా విడుదలైంది. ఈ ప్రోమోలో ఆషు వ్యవహారం విమర్శలకు తావిస్తోందని చెప్పవచ్చు. టాస్క్ లో భాగంగానే ఆమెను పాజిటివ్ గా అనిల్ చెప్పడంతో అక్కడున్న వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టడం జరిగింది. ఆ తర్వాత నట్రాజ్ మాస్టర్ కూడా తనని మంచి స్నేహితురాలు అంటూ తెలిపారు. ఆ సమయంలోనే ఆషు రెడ్డి తనని హీరోయిన్ చేయకండి నాగార్జున గారూ అంటూ కాస్త ఓవర్ యాక్షన్ చేస్తోంది.
ఇక సరయు మాట్లాడుతున్న సమయంలో అనిల్ బ్రదర్ అని పిలిచింది. అప్పుడు ఆషు స్పందిస్తే ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి సార్ అంటూ కాస్త అతిగా మాట్లాడింది అంటూ నెటిజన్లు తెలియజేస్తున్నారు. అయితే నాగార్జున తో ఇలా డైరెక్టుగా కాంటాక్ట్ చేయడం అంటే చాలా అరుదైన విషయం అని చెప్పవచ్చు. ఇక రాబోయే ముందు ముందు ఈమె హడావుడి కొనసాగిస్తుందా లేకపోతే.. ఈమెకు ఈ షో నిర్వాహకులు ఏమైనా కౌంటర్ ఇస్తారా అనే విషయంపై చూడాలి మరి. ఏది ఏమైనా అషు రెడ్డి పోరాటం చేస్తోంది అంటూ బిగ్ బాస్ చూసి ప్రేక్షకులు సైతం మాట్లాడుతున్నట్లుగా సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి