వెండితెరపై ఒకప్పుడు  కథానాయకిగా మెరిసిన రోజా ఆ తరువాత బుల్లితెరపై కూడా తన హవాని కొనసాగించింది. అయితే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల లో చురుకుగా ఉంటూ తమ చుట్టూ ఉండే ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో బుల్లితెరకు గత కొద్ది రోజుల క్రిందట దూరం అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఇలాంటి సమయంలోనే రోజా కు మంత్రి పదవి కూడా దక్కించుకుంది. ఇక తన మాదిరే తన కూతురు కూడా ప్రజా సేవ చేస్తూ అన్షు మాలిక మంచి పేరు సంపాదించుకుంది. అచ్చం తన తండ్రి పోలికలతో ఉండడమే కాకుండా.. తన తల్లి మాదిరే ఎంతొ సేవా గుణం కలిగి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అతి చిన్న వయసులోనే అన్షు వెబ్ డెవలపర్గా, కంటెంట్ క్రియేటివ్గా, రైటర్ గా తన ప్రతిభను కనబరిచి ప్రతి ఒక్కరికి ఆదర్శం గా నిలబడింది ఈమె. అయితే టాలెంట్ ఉండి కూడా కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకునే యువతుల కోసం అన్షు "ట్రాన్స్ ఫార్మింగ్ లైఫ్ విత్ కోడింగ్" అనే  ఒక స్కూల్ కూడా ఓపెన్ చేసింది. ఇక అంతే కాకుండా అతి చిన్న వయసులోనే కొంతమంది పిల్లలను దత్తత తీసుకుని వారి చదువు బాధ్యతను తానే చూసుకుంటోంది అన్షు మాలిక.

అయితే తాజాగా మరొక అద్భుతమైన కార్యక్రమాని చేపట్టింది. అదేమిటంటే తాజాగా హండ్రెడ్ స్మైల్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించి అందు లో గవర్నమెంట్ స్కూల్లో చదివే కొంతమంది పిల్లల ను పై చదువుల కోసం విదేశాలకు పంపించి వారి ని చదివించడం కోసం చాలా కృషి చేస్తోంది. ఇక ఈ విధంగా ఇంత చిన్న వయసు లోనే రోజా కూతురు ఇలాంటి సమాజసేవ చేయడంతో ప్రతి ఒక్కరు ఆమెపై ప్రశంస ల వర్షం కురిపించడమే కాకుండా.. తల్లికి తగ్గ కూతురు అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: