
నవ్య స్వామి:
నా పేరు మీనాక్షి సీరియల్ లో నటించిన నవ్య స్వామి అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఈమెకు ఒక్క రోజుకు రూ. 20వేల పారితోషకం లభిస్తుంది.
ఐశ్వర్య:
కస్తూరి సీరియల్ లో నటించిన ఐశ్వర్య రోజుకు రూ.20 వేల వరకు పారితోషకం తీసుకుంటోంది.
సుహాసిని:
ఒకప్పుడు సినిమాలలో హీరోయిన్గా నటించి.. ఆ తర్వాత సీరియల్స్ కే పరిమితమైన ఈమె ఇప్పుడు దేవతా సీరియల్ లో కూడా నటిస్తోంది. ఒకరోజు షూటింగ్లో పాల్గొనింది అంటే 20వేల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటోంది.
హరిత:
తల్లి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హరిత రోజుకు 12 వేల రూపాయల పారితోషకం అందు కుంటోంది.
ఆషిక:
త్రినాయిని సీరియల్ లో నటిస్తున్న ఆషిక రోజుకు రూ.12 వేల రూపాయల రెమ్యునరేషన్ తీసు కుంటోంది.
వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్:
కార్తీకదీపం సీరియల్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న ప్రేమీ విశ్వనాథ్ వంటలక్కగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అయితే ఈమెతోనే ఈ కార్తీకదీపం సీరియల్ మంచి ఆదరణ పొందిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోని ఈమెకు భారీగా డిమాండ్ ఉన్న నేపద్యంలో ఒక్కరోజు షూటింగ్లో పాల్గొంటే 25 వేల రూపాయలను తీసుకుంటుందని సమాచారం.
వీరు ఒక రోజుకు 20వేల రూపాయల పారితోషకం తీసుకుంటున్నారు అంటే హీరోయిన్లకు మించి పారితోషకం తీసుకుంటున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనా వెండితెర హీరోయిన్ల కంటే బుల్లితెర హీరోయిన్లే ఎక్కువ పారితోషకం తీసుకుంటున్నారు అని స్పష్టం అవుతోంది.